కేశినేనీ ... మొలతాడు కట్టిన మగాడివే అయితే అనేదాకా వచ్చింది పీవీపీ ముచ్చట ..
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా తయారయ్యింది ఏపీలో తాజా పరిస్థితి .విజయవాడ ఎంపీ కేశినేని నాని, పీవీపీల మధ్య ట్విట్టర్ వార్ ఆగేలా కనిపించటం లేదు . ఇక నానీ పీవీపీపై ట్విట్టర్ వేదికగా చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ నేత పివీపీ రివర్స్ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు . ఇక మాటల స్థాయి దాటి తిట్ల దండకాలు అందుకున్నారు ఇరువురు నేతలు. మగాళ్ళు, మొనగాళ్ళు, మొలతాళ్ళు అంటూ మరీ దారుణంగా మాట్లాడుతున్న నేతల తీరుతో ఏపీ ప్రజలు అవాక్కవుతున్నారు.

మొనగాడే అయితే, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన పీవీపీ
మొన్నటికి మొన్న అటు ఇటు కానోళ్ళని మన బెజవాడలో చాలా పేర్లతో పిలుస్తారు. ఆటోనగర్ వెళ్లి అడిగితే చాలా క్లియర్ గా చెపుతారు అని అన్నారు పీవీపీ . అంతకు ముందు బ్యాక్ సీట్లు పెంచుతున్నారు అన్న పీవీపీ ఇప్పుడు మరోమారు కేశినేని నానీ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సవాల్ విసిరారు. ఇక తిట్లలో మరో అడుగు ముందుకు వేసిన పీవీపీ కేశినేని నాని మొనగాడే అయితే, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఇండిపెండెంట్ గా పోటీ చేసి, 40 ఓట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన పీవీపీ వరప్రసాద్ చేసిన ఈ సవాల్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

ఇండిపెండెంట్ గా 40 ఓట్లు తెచ్చుకుని మాట్లాడు అని ట్వీట్ చేసిన పీవీపీ
తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెడుతూ పీవీపీ , "నాలుగు ఓట్లు తెచ్చుకోలేవు అని అనడం కాదు. మొనగాడివి, మొలతాడు కట్టిన మగాడివి అయితే, రాజీనామా చేసి, ఇండిపెండెంట్ గా 40 ఓట్లు తెచ్చుకుని మాట్లాడు బయ్యా!" అని సవాల్ చేశారు . అంతకుముందు "పాపం పార్టీ బండి మూల పడింది అని, దాని తరపున పోటీ చేసి డబ్బా కొట్టుకున్న 2 లక్షల మెజారిటీ కొంచెంలో మిస్ అయ్యానే, అని చాలా ఫీల్ అవుతున్నావంటా! అదే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే, 4 లక్షల మెజారిటీ కొడతావేమో.. నీ బస్సులన్నీ బ్రాండ్ న్యూ కదా!" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు పీవీపీ .

ఇప్పుడు ఏపీలో కేశినేని, పీవీపీ వార్ పైనే చర్చ ..పీవీపీ సవాల్ కు కేశినేని ఏం చెప్తారో ?
ఇక తానేమీ తక్కువ కాదు అన్నట్టు డోస్ పెంచి మరీ పోస్ట్ లు పెడుతున్న కేశినేని నానీ పీవీపీ తాజా పోస్ట్ పై ఎలాంటి ఘాటు రిప్లై ఇస్తారో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏపీలో తాజాగా పార్టీల పరిస్థితి , పాలనపై దృష్టి కంటే ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా వార్ పైన చర్చ జరుగుతుంది. ఇక వీళ్ళు పెడుతున్న పోస్ట్ లకు నెటిజన్లు కూడా తమదైన స్టైల్ లో సమాధానం ఇస్తున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. బయట కూడా చర్చ చేస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications