అమరావతిలో ఇంత జరుగుతోందా?: సుబ్బు నుంచి నివ్వెరపోయే విషయాలు..

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో రౌడీ మూకలు తిష్టవేసినట్టు తెలుస్తోంది. గ్యాంగ్‌లుగా ఏర్పడ్డ కొంతమంది రౌడీలు రాజధాని కేంద్రంగా తమ నేర సామ్రాజ్యాలను విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు.

Rajamouli over designs of Amaravathi చంద్రబాబు కోసం ఎక్కడికైనా వస్తా: రాజమౌళి

ప్రజాప్రతినిధుల అండ కూడా దొరకడంతో నగరంలో వీరి ఉనికిని ప్రశ్నించడానికి కూడా చాలాకాలం ఎవరూ ధైర్యం చేయనట్టుగా సమాచారం. ఎట్టకేలకు ఇటీవల సుబ్బు అనే ఓ రౌడీ పట్టుబడటంతో రాజధాని చుట్టుపక్కల తిష్ట వేసిన రౌడీ మూకలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి.

'బెజవాడలో 'భాయ్' కల్చర్.. సుబ్బు లాంటోళ్లతో, బాబే ప్రోత్సహిస్తున్నాడు?'

ఇటీవల పట్టుబడ్డ సుబ్బు అనే రౌడీ షీటర్‌ను విజయవాడ పోలీసులు రాచకొండ పోలీసులకు అప్పగించారు. అతన్ని విచారించిన పోలీసులు బెజవాడ రౌడీల యాక్టివిటీస్‌కు సంబంధించి పలు వివరాలు సేకరించారు.

బుకాయించిన సుబ్బు:

బుకాయించిన సుబ్బు:

పొట్లూరి ఈశ్వర్, తెల్లగోర్ల సునీల్‌కుమార్‌ అనే వ్యక్తులు తాము సుబ్బు కోసమే బీహార్ నుంచి అక్రమంగా గన్ తెప్పించామని చెబుతోన్న సంగతి తెలిసిందే. మరోవైపు పోలీసులు ఎదుట సుబ్బు మాత్రం మరో విధంగా చెప్పినట్టు తెలుస్తోంది. గన్ అమ్మాలనే ఉద్దేశంతో ఈశ్వర్, సునీల్‌లే తనను సంప్రదించారు తప్ప.. దాని కొనుగోలు కోసం నేనేమి వాళ్లను సంప్రదించలేదని సుబ్బు చెప్పడం గమనార్హం.

 అలా ప్రశ్నించడంతో నిజాలు

అలా ప్రశ్నించడంతో నిజాలు

సుబ్బు చెబుతున్న వాదన నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నీ నుంచి ఎలాంటి సమాచారం లేకుండా నీకు గన్ అవసరం అనే విషయం వాళ్లకు ఎలా తెలుస్తుంది?, అసలు నీతో వాళ్లకేమైనా పరిచయం ఉందా? అసలు గన్ వాడాల్సిన అవసరమేమొచ్చింది? అంటూ సుబ్బుకు ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. దీంతో తడబడ్డ సుబ్బు అసలు విషయాన్ని చెప్పినట్టు సమాచారం.

 నివ్వెరపోయే విషయాలు

నివ్వెరపోయే విషయాలు

రాచకొండ పోలీసుల విచారణలో అమరావతికి సంబంధించి నివ్వెరపోయే విషయాలు బయటపడ్డట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా రౌడీ గ్యాంగులు ఇక్కడ తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ టీడీపీ నేత అండ కూడా వీరికి ఉన్నట్టు చెబుతున్నారు. సుబ్బు ప్రస్తుతం న్యూ రాజరాజేశ్వరిపేట కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్నట్టు నిర్దారించారు.

తన రౌడీయిజంతో పాయకాపురం, కొత్త ఆర్‌ఆర్‌పేట, అజిత్‌సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాలను సుబ్బు తన గుప్పిట్టో పెట్టుకున్నాడని పోలీసులు గుర్తించారు. మున్ముందు నగరవ్యాప్తంగా తమ నేర కార్యకలాపాలను వ్యవస్థీకృతం చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్టు విచారణలో వివరాలు రాబట్టారు.

 ప్రత్యర్థి గ్యాంగ్‌లను ఎదుర్కోవడానికే గన్

ప్రత్యర్థి గ్యాంగ్‌లను ఎదుర్కోవడానికే గన్

నగరంలో అప్పటికే తిష్ట వేసిన కొన్ని గ్యాంగ్ లతో వైరం కారణంగా.. సుబ్బు తన రౌడీ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఆటంకం ఏర్పడింది. దీనికి తోడు తెనాలిలో పాత కక్షలు కూడా వెంటాడుతుండటంతో తనకో గన్ కావాలని సుబ్బు భావించాడు. ఈ నేపథ్యంలోనే బీహార్‌ నుంచి అక్రమంగా ఆయుధం తెప్పించేందుకు ఈశ్వర్, సునీల్‌ను సంప్రదించాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాలను రాచకొండ పోలీసులు విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 బెజవాడను జల్లెడ పడుతున్న పోలీసులు

బెజవాడను జల్లెడ పడుతున్న పోలీసులు

రాజధానిలో రౌడీ మూకలపై రాచకొండ పోలీసులు అందించిన సమాచారంతో బెజవాడ పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరంలో బుధవారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్‌ నిర్వహించారు. వాంబేకాలనీలో విస్తృతంగా తనిఖీలు చేసిన పోలీసులు.. 9 మంది పాత నేరస్తులు, 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. మొత్తం 274 వాహనాలను తనిఖీ చేయగా, ఎలాంటి రికార్డులు లేని 10 మోటార్‌ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డెన్, సెర్చ్‌ను నగరం అంతటా విస్తృతంగా నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Rachakonda police interrogated rowdy sheeter Subbu, who held by amaravati police
Please Wait while comments are loading...