వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్క్‌ల్లోకి పిలిచి ర్యాగింగ్, అసభ్య మాటలు: ఆంధ్రా వర్సిటీలో కలకలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజనీరింగ్‌ కళాశాల మహిళా వసతి గృహంలో తమ పైన పైన సీనియర్‌ విద్యార్థినీలు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని జూనియర్లు ఆరోపించారు. సీనియర్లు తమను పార్కులకు పిలిచి ర్యాగింగ్‌ చేస్తున్నారని, అసభ్యంగా మాట్లాడుతున్నారని వారు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య ఉమామహేశ్వర రావు మహిళా వసతి గృహంలో మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సీనియర్‌, జూనియర్‌ విద్యార్థినులతో మాట్లాడారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

వసతి గృహంలో జూనియర్లు, సీనియర్లకు వేర్వేరుగా వసతి కల్పించామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. భోజనం చేసే సమయంలో సీనియర్‌ విద్యార్థులు కొందరు జూనియర్ల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారని తమ దృష్టికొచ్చిందన్నారు. దీంతో మెస్‌లో కూడా పూర్తి స్థాయి పర్యవేక్షణ ఏర్పాటు చేస్తామన్నారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాస రావు విచారణకు ఆదేశించారు. ఈ విషయం మంత్రి గంటా దృష్టికి వెళ్లింది. గంటా వర్సిటీకి వెళ్లనున్నారు. అధికారులతో సమావేశమవుతారు.

Ragging in Andhra University

అనంతపురంలో కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య

అనంతపురం జిల్లాలో మంగళవారం ఘోర విషాదం చోటు చేసుకుంది. కందుర్తి మండలంలోని బెస్తరపల్లిలో కుటుంబ కలహాలతో కూతురు, కొడుకును చంపిన తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పిల్లల్లో ఒకరి వయస్సు మూడేళ్లు, మరొకరి వయస్సు ఆర్నెల్లు.

ఎర్రచందనం పట్టివేత

చిత్తూరు జిల్లా తిరుపతిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పదిలక్షల రూపాయల విలువ గల ఎర్ర చందనం పట్టుకున్నారు. స్కార్పియోలో ఎర్ర చందనం స్మగ్లర్లు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. పదిహేను మంది స్మగ్లర్లు పరారయ్యారు.

English summary
Andhra University junior students alleged that they are facing ragging in University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X