అనంత జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం.. అర్ధనగ్నంగా నిలబెట్టి మరి..
అనంతపురం జేఎన్టీయూ క్యాంపస్‌లో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడడంతో జూనియర్లు భయాందోళనకు గురవుతున్నారు. నెలరోజుల కిందట బిటెక్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచే బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నా.. వర్సిటీ అధికారులు, వార్డెన్లు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ర్యాగింగ్‌కు పాల్పడ్డ 18 మంది సీనియర్లను సస్పెండ్
ప్రశాంతమైన జేఎన్టీయూ ఇంజనీరింగ్ క్యాంపస్‌లో ఒక్క సారిగా ర్యాగింగ్ భూతం కోరలు చాచింది. బిటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్ ఒక్కసారిగా బయటపడడంతో కాలేజీ ప్రిన్సిపాల్ అప్రమత్తమయ్యారు. వారిని గుర్తించి రాత్రికి రాత్రే ర్యాగింగ్‌కు పాల్పడిన 18 మంది సీనియర్లను సస్పెండ్ చేశారు. ఈ ర్యాగింగ్ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమించారు.

ఆర్ధనగ్నంగా నిలబెట్టి..
శుక్రవారం రాత్రి సీనియర్ విద్యార్థులు ఇద్దరు జూనియర్లను తమ గదులకు తీసుకెళ్లినట్లు విచారణాధికారులు, విద్యార్థులు తెలిపారు. ఆర్ధనగ్నంగా నిలబెట్టి.. తాము చెప్పిన పనిచేయాలని భయపెట్టినట్లు పేర్కొన్నారు. 18 మంది సీనియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు మొదటి సంవత్సరం విద్యార్థులు కాలేజీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కళాశాల అధికారులు, వార్డెన్లు వారి హాస్టల్స్‌కు వెళ్లి విచారించారు. ఈఘటనపై కళాశాల కమిటీ సమావేశమై ర్యాగింగ్‌కు పాల్పడిన 18 మంది విద్యార్థులను ప్రిన్సిపల్ సుజాత సస్పెండ్ చేశారు. హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులు ఇష్టానుసారంగా బయటతిరిగితే సహించేదిలేదని ఆమె హెచ్చరించారు.

ర్యాగింగ్ నిరోధక కమిటీపై విమర్శలు
జేఎన్టీయూ కళాశాలలో ర్యాగింగ్ అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ సూజాత తెలిపారు. ర్యాగింగ్ పాల్పడితే కఠన చర్యలు తప్పవని విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చారు. అయితే ర్యాగింగ్ నిరోధక కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతి ఏడాది తరగతులు ప్రారంభమైన తర్వాత ర్యాగింగ్‌పై విద్యార్థులకు కమిటీ అవగాహన కల్పించాలి. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవగాహన సదస్సులు నిర్వహించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా క్యాంపస్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నాయి. మరలా ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూడాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications