వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు ఆశ‌లు అడియాశ‌లే : ఆ కోరిక నెర‌వేర‌దు : జెసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

|
Google Oneindia TeluguNews

ఎప్పుడూ సంచ‌ల‌న కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచే అనంత‌పురం ఎంపి జెసి దివాక‌ర‌రెడ్డి మ‌రోసారి అటువంటి వ్యాఖ్య‌లు చేసి ఏకంగా జాతీయ స్థాయిలో టిడిపి అధినేత చంద్ర‌బాబును ఇరుకున పెట్టారు. ఢిల్లీ వేదిక‌గా టిడిపి ఎంపి జెసి దివాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

చంద్ర‌బాబు ఆశ‌లు అడియాశ‌లే...
ఏపి పై కేంద్ర తీరును నిర‌సిస్తూ.. టిడిపి ఎంపీలు ఢిల్లీలో ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు. ఎంపి మాగంటి బాబు దీక్ష చే సారు. బాబు కు టిడిపి ఎంపీలు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఆ స‌మ‌యంలో ప్ర‌సంగించిన ఎంపి దివాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యా ఖ్య‌ల‌ను చేసారు. త‌మ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏఐసిసి అధినేత రాహుల్ ను ప్ర‌ధాని చేయాల‌ని ఆశ ప‌డుతున్నార ని..కానీ, అది అడియాశే అవుతుంద‌ని వ్యాఖ్యానించ‌టం తో అక్క‌డ ఉన్న వారంతా ఖంగుతిన్నారు. రాహుల్ ప్ర‌ధాని అవ్వాలంటూ చంద్ర‌బాబు జాతీయ స్థాయిలో అన్ని రాజ‌కీయ పార్టీల‌ను మోదీకి వ్య‌తిరేకంగా ఒక్క‌టి చేస్తున్నానంటూ చెబుతూ వ‌స్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఢిల్లీ వేదిక‌గా జెసి చేసిన వ్యాఖ్య‌ల‌తో టిడిపి నేత‌ల్లో క‌ల‌క‌లం మొద‌లైంది. అదే స‌మ‌యంలో మ‌రో ఇర‌వై ఏళ్ల పాటు ఏపిలో కానీ..కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాద‌ని దివాక‌ర్ రెడ్డి ఢిల్లీ వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేసారు.

Rahul would not become PM : TDP MP JC sensational comments..

రైల్వే జోన్ వ‌ల‌న ఉప‌యోగం లేదు..
ఏపి విభ‌జ‌న పైనా దివాక‌ర్ రెడ్డి స్పందించారు. తన కుమారుడు రాహుల్ గాంధీ ని ప్రదాని చేయడానికి ఎపిని సోనియా గాంధీ ముక్కలు చేసార‌ని..చివరికి ఆమె ముక్కలు అయిందని వ్యాఖ్యానించారు. ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి కనబడడం లేదని ఆయన అన్నారు. రైల్వే జోన్ కూడా వచ్చే అవకాశం లేదని ,దానివల్ల ఉపయోగం లేదని ఆయన అన్నారు. రైల్వే జోన్ కోసం ఒక వైపు ఉత్త‌రాంధ్ర టిడిపి ఎంపీలు దీక్ష‌లు సైతం చేసారు. పోరాటాలు కొన‌సాగిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో వారి స‌మ‌క్షంలోనే జెసి ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌టం తో వారు విస్తుపోయారు. గ‌తంలోనూ జెసి ఇదే ర‌కంగా వ్యాఖ్య‌లు చేసారు. ఏపికి ప్ర‌త్యేక హోదా రాదంటూ స్ప‌ష్టం చేసారు. అప్ప‌ట్లో అటువంటి వ్యాఖ్య‌లు చేయ‌వద్ద ని పార్టీ అధినాయ‌క‌త్వం సూచించింది. ఇప్పుడు తిరిగి ఢిల్లీలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల పై టిడిపి అగ్ర‌నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary
TDP MP JC Diwakar Reddy key comments on Rahul Gandhi. He says Rahul would nor become PM in coming 20 years. This comments become hot topic in political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X