బెంగళూరుకు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు - స్టేషన్లు, షెడ్యూల్...!!
దసరా సెలవుల ప్రారంభం వేళ రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. పండుగ రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే ప్రధాన రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు భారీగా కొన సాగుతోంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్ల పైన నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో భాగంగా బెంగళూరు కంటోన్మెంట్ - బీదర్, యశ్వంత్‌పూర్ - సహర్సా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటన చేసారు. ఈ రైళ్ల రూట్.. హాల్టింగ్ స్టేషన్లు.. షెడ్యూల్ అధికారులు వెల్లడించారు.
దసరా, దీపావళి పండుగల వేళ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగుతాయి. దీంతో, రద్దీకి అనుగుణంగా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ట్రైన్ నంబర్ 06589 బెంగళూరు కంటోన్మెంట్ - బీదర్ - బెంగళూరు కంటోన్మెంట్' ఈ నెల 9, 16 తేదీల్లో (శుక్రవారం) ప్రయాణించనుంది. అదే విధంగా ట్రైన్ నంబర్ 06590 బెంగళూరు కంటోన్మెంట్ - బీదర్ - బెంగళూరు కంటోన్మెంట్' ఈ నెల 10, 17 తేదీల్లో (శనివారం) ప్రయాణించనుంది. ట్రైన్ నంబర్ 06581 యశ్వంత్‌పూర్ - సహర్సా ఈ నెల 11 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం ప్రయాణించనుందని వెల్లడించారు. కాగా.. ట్రైన్ నంబర్ 06582 సహర్సా- యశ్వంత్ పూర్ ఈ నెల 14 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉండనుంది.

రైల్వే శాఖ తాజా నిర్ణయాలు
ఈ రైళ్ల రూట్... హాల్టింగ్ స్టేషన్లను ప్రకటించారు. రైలు నంబర్ 06589 / 06590 బెంగళూరు కంటోన్మెంట్ - బీదర్ - బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైళ్లు యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, వాడి, షాహాబాద్, కలబురిగి, హుమ్నాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. కాగా.. నంబర్ 06581 / 06582 యశ్వంత్‌పూర్ - సహర్స - యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైళ్లు యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపురం, గూటి, ధోనే, కర్నూలు సిటీ, మహబూబ్‌నగర్, కాచిగూడ, కాజీపేట్, రామగుండం, బల్హర్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపారియా, నర్సింగపూర్, మదన్ మహల్, కట్ని, సత్నా, ప్రహేయోక్యపూర్, మాణిక్‌పూర్, మానిక్‌పూర్‌లలో హాల్టింగ్ కల్పించారు. రద్దీకి అనుగుణం గా మరిన్ని రైళ్లు అవసరమైన రూట్లలో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
