తత్కాల్ టికెట్ బుకింగ్ లో రూల్స్, టైమింగ్స్ మార్పు- ఇక నుంచి..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ విధానం లో మార్పులు తెచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే తత్కాల్ టికెట్ల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. తత్కాల్ టికెట్ బుకింగ్.. సమయాలు.. క్యాన్సిలేషన్ వంటి వాటిల్లో మార్పులు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయించింది. చెల్లింపు విధానంలోనూ మార్పులు చేసింది. తత్కాల్ విధానం మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు మార్పులు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
తత్కాల్ మార్పులు
తత్కాల్ టికెట్ విధానంలో రైల్వే కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. తత్కాల్ టికెట్ ముందు రోజు పొందేలా రైల్వే కొనసాగిస్తోంది. ఇందు కోసం కేటగిరీల ఆధారంగా సమయాలు అమలు చేస్తోంది. కాగా, వస్తున్న ఫిర్యాదులు.. ప్రయాణీకు ల నుంచి వస్తున్న సూచనల అనుగుణంగా కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి తత్కాల్ లో
ఏసీ క్లాస్ టికెట్ల బుకింగ్ - ఉదయం 11:00 గంటలకి ప్రారంభం కానుంది. అదే విధంగా నాన్-ఏసీ / స్లీపర్ క్లాస్ టికెట్ల బుకింగ్ - మధ్యాహ్నం 12:00 గంటలకి అందుబాటులోకి వస్తుంది. ఇక, ప్రీమియం తత్కాల్ టికెట్ల బుకింగ్ - ఉదయం 10:30 గంటలకి మొదలవుతుంది.

ఇదీ విధానం
ముందు రోజే తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో ఎలాంటి మార్పు లేదు. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్రయాణం చేసే రైలు.. తరగతిని ఎంపిక చేసుకోవాలి. కోటా నుంచి 'తత్కాల్'ను సెలెక్ట్ చేయాలి. అక్కడ కోరిన విధంగా ప్రయాణికుల వివరాలు, ఐడీ ప్రూఫ్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత.. చెల్లింపు చేసి టికెట్ బుక్ చేసుకొనేలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు తాజా మార్పుల ప్రకారం ప్రయాణికుల వివరాలు ముందుగానే భర్తీ చేసే ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
ఇక నుంచి ఇలా
ఇక నుంచి చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెంచుతూ నిర్ణయించారు. ఇక, కాప్చా వేరిఫికేషన్ సిస్టమ్ మరింత సరళీకరణ చేసారు. వెబ్‌సైట్, యాప్ రెండింటికీ ఒకే విధమైన లాగిన్ విధానం కల్పించారు. అయితే, ఒక PNR కింద గరిష్టంగా నలుగురు ప్రయాణికులకు మాత్రమే టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పడు అమల్లో ఉన్న విధంగానే తత్కాల్ కోటాలో ఎటువంటి రాయితీలు వర్తించవు. ప్రయాణ సమయంలో ఐడీ ప్రూఫ్ తప్పనిసరి. తాజా మార్పుల తో ప్రయాణీకులు తత్కాల్ టికెట్ సులభంగా పొందే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications