విజయవాడ - తిరుపతి జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు : ఆగే స్టేషన్లు, షెడ్యూల్..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవుల రద్దీ వేళ ప్రధాన మార్గాల్లో రైళ్లు రద్దీగా మారాయి. ముఖ్యమైన రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్లు ఖాళీ లేవు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరుపతికి వెళ్లే భక్తుల రద్దీ పెరిగింది. దీంతో.. విజయవాడ నుంచి తిరుపతికి ప్రత్యేక జన సాధారణ్ రైళ్లను అధికారులు ప్రకటించారు. ఈ రైళ్ల రూట్... ఆగే స్టేషన్లతో పాటుగా పూర్తి టైమింగ్స్ ను ప్రకటించారు.
దసరా సెలవులు.. బ్రహ్మోత్సవాల వేళ తిరుపతికి వెళ్లే ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. దీంతో, రద్దీకి అనుగుణంగా తిరుపతికి జన్ సాధారణ్ స్పెషల్ రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు తిరుపతి - విజయవాడ మార్గంలో ఈ నెల 17 నుంచి 20 వరకు నడవనున్నాయి. ట్రైన్ నంబర్ 07251 తిరుపతి - విజయవాడ జన సాధారణ్ స్పెషల్ ఈ రైలు అక్టోబర్ 17న తిరుపతి నుంచి విజయవాడ వరకు ప్రయాణించనుంది. తిరుపతిలో తెల్లవారుజామున 2.30గంటలకు బయల్దేరి ఉదయం 9.30గంటలకు విజయవాడ చేరుతుంది. అదే విధంగా ట్రైన్ నంబర్ 07249 విజయవాడ - తిరుపతి జన సాధారణ్ స్పెషల్ రైలు అక్టోబర్ 17 నుంచి 20 వరకు విజయవాడ నుంచి తిరుపతి వరకు 4 ట్రిప్పులు కొనసాగుతుంది.

రద్దీ వేళ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
విజయవాడలో ఉదయం 10గంటలకు బయల్దేరి రాత్రి 7గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ట్రైన్ నంబర్ 07250 తిరుపతి - విజయవాడ (జన సాధారణ్ స్పెషల్) : ఈ రైలు అక్టోబర్ 17 నుంచి 19 వరకు తిరుపతి నుంచి విజయవాడ వరకు 3 ట్రిప్పులు కొనసాగుతుంది. తిరుపతిలో రాత్రి 9.10గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.30గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైళ్లు రేణిగుంట, శ్రీకాళహస్తి వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చిన గంజాం, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి, దుగ్గిరాల, పెద్దవాడిపూడి స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.













Click it and Unblock the Notifications
