వర్షాలవేళ ప్రయాణికులకు, సిబ్బందికి రైల్వే హెచ్చరిక!
వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అనేక జిల్లాలలో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
వర్షాలతో రైల్వే సిబ్బందికి కీలక సూచనలు
రైల్వే ట్రాక్ లు భారీ వర్షాల కారణంగా మునిగిపోతున్న క్రమంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో 11 సెంటీమీటర్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వేళ, రాష్ట్రంలో వర్షాలు ఈ వారం మొత్తం కొనసాగుతున్న క్రమంలో రైల్వే శాఖ తమ సిబ్బందికి కీలక సూచనలు చేసింది.

రైళ్ళ వేగం తగ్గింపు
వర్షాకాలం నేపథ్యంలో వర్షాలు పడిన ప్రాంతంలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే రైళ్లు నడపాలని సూచించింది. ముఖ్యంగా భారీ వర్షానికి పిడుగురాళ్ల మరియు బెల్లంకొండ మధ్య 59వ బ్రిడ్జి వద్ద నీరు ప్రమాద స్థాయికి చేరుకున్న కారణంగా నీరు పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే రైళ్ళను సాధారణ వేగంతో నడిపేందుకు అనుమతి ఇస్తామని రైల్వే శాఖ పేర్కొంది.
వర్షాలతో రైల్వే ప్రయాణికుల రక్షణకు చర్యలు
వర్షాకాలంలో రైలు ప్రమాదాలను తగ్గించడానికి అనునిత్యం వర్షాలు పడుతున్న ప్రాంతాల పైన మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న భారతీయ రైల్వే, రైలు ప్రయాణికుల రక్షణ కోసం తగిన చర్యలు చేపడుతుంది. భారీ వర్షానికి రైల్వే పట్టాలు నీట మునిగిన చోట ప్రమాదాలకు గురికాకుండా ఎప్పటికప్పుడు తన నిర్ణయాలను తీసుకుంటూ రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.
వర్షాకాలంలో రైల్వే చర్యలు
ఎండాకాలం, చలికాలం కంటే వర్షాకాలంలో రైల్వే మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రమాదాలను నివారిస్తుంది. ప్రయాణాలు చేసే రైల్వే ప్రయాణికులకు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తుంది. ప్రయాణికులు రైల్వే జారీ చేసే షెడ్యూల్ పైన ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండాలని, రైళ్ల రాకపోకల వివరాలను, ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలను తెలుసుకోవాలని సూచిస్తుంది.
సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించే ఇండియన్ రైల్వే
రియల్ టైం రైళ్ల రాకపోకలు తెలుసుకోవడానికి రైలు మిత్ర యాప్ ను ఫాలో కావాలని చెబుతోంది. వర్షాకాలంలో రైల్వే ట్రాక్ల తనిఖీలను తరచూ నిర్వహిస్తుంది. ఇక భారత వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ప్రయాణికులకు సూచిస్తుంది. ఇదే సమయంలో సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.












Click it and Unblock the Notifications