కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతిని ముంచెత్తిన వానలు...కపిలతీర్థంలో జలప్రళయం

|
Google Oneindia TeluguNews

భారీ వర్షాలు..వదరలతో పలు ప్రాంతాల్లో జల ప్రళయం ముంచుకొస్తోంది. ఇప్పటికే చిత్తూరు...నెల్లూరు జిల్లాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. తిరుపతి పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. తిరుమలలోనూ భారీగా వరద నీరు రావటంతో ఘాట్ రోడ్లు మూసివేసారు. మాడ వీధుల్లో వరద నీరు ప్రవహిస్తోంది. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఉదయం 3-4 గంటల మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ ప్రభావంతో తమిళనాడు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

Rains in Andhra Pradesh live updates in telugu:Tirupati under floods, Depression to make a landfall today

Newest First Oldest First
6:20 PM, 19 Nov

వరద ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను సీఎం ప్రధానికి వివరించారు. సహాయ కార్యక్రమాల కోసం నేవీ హెలికాప్టర్లు వినియోగించుకుంటున్నామని ఆయన ప్రధానికి తెలిపారు
6:19 PM, 19 Nov

రాష్ట్రంలో పరిస్థితులను, వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రధాని మోదీకి వివరించారు
6:19 PM, 19 Nov

సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆరా తీసిన ప్రధాని మోదీ
3:47 PM, 19 Nov

వేటకు వెళ్లకూడదని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు.
3:47 PM, 19 Nov

దీని ప్రభావంతో.. తీరంవెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు
3:46 PM, 19 Nov

వాయు గుండం ప్రభావంతో.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ సమీపంలో విస్తారంగాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
3:46 PM, 19 Nov

ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి - చెన్నై సమీపంలో తీరందాటిందని తెలిపింది.
3:46 PM, 19 Nov

నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.
1:58 PM, 19 Nov

సముద్రంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్న మరి కొన్ని గృహాలు
1:57 PM, 19 Nov

ఉప్పాడ పాత మార్కేట్ సెంటర్, సూరాడ పేటలో ఎనిమిది మత్స్యకార గృహాలు నేలమట్టం
1:57 PM, 19 Nov

అలల తాకిడికి గృహలు మింగేసిన సముద్రం
1:56 PM, 19 Nov

ఒక పక్క పౌర్ణమి, మరోపక్క తూఫాన్ కారణంగా రాత్రి నుండి ఎగసిపడుతున్న రాకాసి అలలు
1:56 PM, 19 Nov

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న భారీ కెరటాలు
1:56 PM, 19 Nov

తూ.గో..ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం
8:18 AM, 19 Nov

తిరుపతి-తిరుమల

తిరుపతి-తిరుమలలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. సీఎం జగన్ పరిస్థితిని సమీక్షించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు
8:08 AM, 19 Nov

చిత్తూరు

చిత్తూరులో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి కొట్టుకుపోతున్న పశువులు
8:07 AM, 19 Nov
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు

చిత్తూరులో వరదనీటిలో చిక్కుకుపోయిన స్కూలు వ్యాన్. పిల్లలను సురక్షితంగా కాపాడిన స్థానికులు
8:05 AM, 19 Nov

లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
8:05 AM, 19 Nov

సహాయ చర్యలకు‌ చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు NDRF, SDRF బృందాలు
8:05 AM, 19 Nov

మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
8:04 AM, 19 Nov

తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో గాలులు
8:04 AM, 19 Nov

అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు అవకాశం
8:04 AM, 19 Nov

దీని ప్రభావంతో నేడు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు
8:04 AM, 19 Nov

తెల్లవారుజామున 3-4గంటల తీరం దాటిన వాయుగుండం
8:03 AM, 19 Nov

ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి - చెన్నై సమీపంలో తీరం దాటింది
8:03 AM, 19 Nov

తీరం దాటిన వాయుగుండం
8:01 AM, 19 Nov

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు పలు జిల్లాలు జలమయం

English summary
Heavy Rains hit several districts of AndhraPradesh with the depression that occured in Andaman seaa likely to make a landfall today. Chittoor recieved heavy rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X