రోజా, కొడాలి నానిపై రజినీకాంత్, చంద్రబాబు ఫ్యాన్స్ రివెంజ్ మాములుగా లేదుగా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు అభిమానులు, అలాగే రజినీకాంత్ అభిమానులు నిన్న ఏపీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అఖండ విజయాన్ని దక్కించుకోవడంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇక ఇదే సమయంలో ఏపీలో పలువురు మంత్రులు, మాజీ మంత్రులు ఓటమి పాలు కావడంతో వారు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ కోవలో రోజా, కొడాలి నాని నిలిచారు.
రోజా, కొడాలి నానీలను టార్గెట్ చేస్తున్న రజనీకాంత్ , చంద్రబాబు ఫ్యాన్స్
ఏపీలో చంద్రబాబు, రజినీకాంత్ అభిమానులు రోజా, కొడాలి నానీలను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికలలో ఓటమి పాలైన రోజా, కొడాలి నానిలకు అర్థమైందా రాజా అంటూ రజినీకాంత్ డైలాగ్ తో సెటైర్లు వేస్తున్నారు. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ పైన, చంద్రబాబుపైన ప్రశంసలజల్లు కురిపించటంతో మంత్రి రోజా, కొడాలి నాని ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

చంద్రబాబును పొగిడిన రజనీకాంత్ ను టార్గెట్ చేసిన రోజా
రజినీకాంత్ సినిమాలలో హీరో కానీ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో జీరో అయ్యారని, ఇన్నాళ్లు రజినీకాంత్ సంపాదించుకున్న పేరును పోగొట్టుకున్నారు అంటూ రోజా విమర్శించారు. అసలు రాజకీయాలే వద్దనుకున్న రజినీకాంత్ మళ్లీ రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నాడో చెప్పాలంటూ రోజా వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన మాటలపై ఆయన సరిదిద్దుకుని ప్రకటన విడుదల చెయ్యాలని రోజా వ్యాఖ్యానించారు.
రజనీకాంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని
ఇక కొడాలి నాని కూడా రజినీకాంత్ సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడు అని, మూడు రోజులు షూటింగ్ చేస్తే, నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజినీకాంత్ తెలుగు ప్రజలకు ఏం చెబుతాడని, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ రజినీకాంత్ దిగజారిపోతున్నాడు అంటూ తిట్టిపోశారు.
రోజా, కొడాలి నాని వ్యాఖ్యలకు రజనీ వ్యాఖ్యలతో కౌంటర్
ఇక ఆ వ్యాఖ్యలను ఎన్నికల ఫలితాల తర్వాత గుర్తు చేస్తున్న రజినీకాంత్, చంద్రబాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా రజినీకాంత్ డైలాగులతో రోజాకు, కొడాలి నాని కి షాక్ ఇస్తున్నారు. రోజా, కొడాలి నాని అప్పట్లో చెప్పిన మాటలు, ఆ తర్వాత రజినీకాంత్ చెప్పిన మాటలు వీడియో ఎడిట్ చేసి పెడుతూ ట్రోల్ చేస్తున్నారు.
Never mess with rajinikanth ✊🏻❤️🔥
— Prasanth | 2898AD (@EvarSirMeeru) June 4, 2024
Back off you piece of shit @YSRCParty pic.twitter.com/IfW7wLbwqQ
అర్థమైందా రాజా అంటూ రోజా, కొడాలి నాని ట్రోల్
మొరగని కుక్క ఉండదు, విమర్శించని నోరు ఉండదు. ఈ రెండు లేని ఊరు ఉండదు. అయినా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి.. అర్థమైందా రాజా అంటూ గట్టిగా రజినీకాంత్ డైలాగ్ తో సెటైర్లు వేస్తున్నారు. రజినీకాంత్ తోనూ, చంద్రబాబుతోను అసలే పెట్టుకోవద్దు అంటూ ఈ వీడియోల ద్వారా వారికి గట్టి షాక్ ఇస్తున్నారు. గట్టిగానే రివెంజ్ తీర్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications