Pawan Kalyan: బాబాయి కోసం అబ్బాయి.. వైరలవుతోన్న పోస్ట్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు కోసం సినీ ప్రముఖుల సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే తమ్ముడి కోసం మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "కొనిదేల పవన్ కల్యాణ్. అమ్మ కడుపులో ఆఖరిగా పుట్టినా అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలనే విషయంలో మాత్రం పవన్ ముందుంటాడు. తన కంటే జనం గురించి ఆలోచించ మనస్తత్వం నా తమ్ముడు కల్యాణ్ బాబుది" అని చిరంజీవి వీడియోలో చెప్పారు.
"ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కల్యాణ్ తన సొంత సంపదను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం. సరిహద్దులో ప్రాణలు పణంగా పెట్టే సైనికుల కోసం పెద్ద మొత్తం అందివ్వడం, ఎందరికో సాయం చేయడం చూస్తే.. ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సిందని అనిపిస్తుంది. పవన్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడు. కానీ రాజకీయాల్లోకి ఇష్టంగా వచ్చాడు" అని చిరు చెప్పారు.

తాజాగా ఇదే వీడియోను రామ్ చరణ్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. "మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరొపక్క మిగతా నటులు కూడా పవన్ కల్యాణ్ మద్దతు పలుకుతున్నారు. హీరో నాని కూడా పవన్ కు మద్దతుగా ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
"ప్రియమైన పవన్ కళ్యాణ్ మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని, మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అని ట్వీట్ చేశాడు. ఇప్పటికే పవన్ గెలుపు కోసం నాగబాబు, ఆయన భార్య, కుమారుడు వరుణ్ తేజ్, పవన్ అల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రచారం చేశారు. జబర్ధస్త్ నటులు గెటపు శ్రీను, సుడిగాలి సుధీరు, శకలక శంకర్, హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications