వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానయాన రంగంలోకి రాం చరణ్: బేగంపేట నుంచి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్రమాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ తేజ విమానయాన రంగంలోకి అడుగు పెట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. టర్భో మేఘ అనే పేరుతో ఆయన ప్రాంతీయ రీజనల్ ఎయిర్ లైన్స్ సంస్థను స్థాపించాడట. ఈ సంస్థ డైరెక్టర్లుగా రామ్ చరణ్ తేజ, వంకాయలపాటి ఉమేష్‌లు ఉన్నారు.

ఈ సంస్థకు కేంద్ర విమానయాన శాఖ అనుమతి మంజూరు చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. రీజినల్ ఎయిర్ లైన్స్ అయినందున నిర్ధారిత ప్రాంతాలకు ఈ సంస్థ విమానాలను నడుపుతుంది. అధీకృత పెట్టుబడిగా రూ.15 కోట్లు, చెల్లించిన మూలధనంగా రూ.12.01 కోట్లు పెట్టుబడి పెట్టారు. టర్భో మేఘ పేరు హైదరాబాద్ కేంద్రంగా 2013 మార్చి 14న నమోదైంది.

Ram Charan Teja going to enter into Airline Business!

కాగా, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొత్తగా ఆరు కొత్త ఎయిర్ లైన్స్‌కు అనుమతులు ఇచ్చాయి. చాలా రోజులుగా పెండింగులో ఉన్న ఆరు సంస్థలకు మంత్రి అశోక గజపతి రాజు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే భారత్‌లో ఎయిర్ ఇండియా, ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్, గో ఎయిర్, ఎయిర్ కోస్టా సంస్థలు ఉన్నాయి. హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఈ ఎయిర్‌లైన్స్ నిర్దిష ప్రాంతాలకు విమానాలను నడుపుతుంది.

English summary
It is said that, Turbo Megha currently has two directors/partners including Umesh and Ram Charan Teja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X