నాగబాబుకు రాంగోపాల్ వర్మ షాకింగ్ కౌంటర్!!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై అమరావతి ఉద్యమ నేత కొలికి పూడి శ్రీనివాసరావు చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ దుమారం కొనసాగుతుంది . రాంగోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెలిసిన వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తానని కొలికిపూడి శ్రీనివాసరావు ఒక టీవీ డిబేట్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక రాంగోపాల్ వర్మను ఉద్దేశించి నాగబాబు కొలికిపూడి వ్యాఖ్యలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. నాగబాబు తాను చేసిన ట్వీట్ లో ఆర్జీవి తల నరికితే కోటి రూపాయలు ఇస్తానని ఆవేశంగా మాట్లాడిన వ్యక్తి యాక్షన్ కు రియాక్షన్ గా ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎవరైనా తనపై దాడి చేసే అవకాశం ఉందని తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆర్జీవి అంటూ పేర్కొన్నారు.

ఇక దీనిపై తన కన్ క్లూజన్ ఇచ్చిన నాగబాబు ఆర్జీవి గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు, నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని పేర్కొన్నారు. ఆర్జీవి గారు మీరు ఏం భయపడకండి.. మీ జీవితానికి ఏ డోకా లేదు.. మీ ప్రాణానికి ఏ ఆపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను అంటూ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన వెధవ మీకు ఎటువంటి హాని తల పెట్టడు. హీరో విలన్ కొట్టుకుంటుంటే కమెడియన్ గాడ్ని ఎవడు చంపడు కదా.. మీరు ఏం వర్రీ అవ్వకండి.. కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ వోడ్కా పెగ్గేసి పడుకోండి అంటూ నాగబాబు ఆర్జీవి ని టార్గెట్ చేశారు.
నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు రాంగోపాల్ వర్మ. సార్ నాకన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే.. నా సినిమాలో మీరు అంటూ నాగబాబును మళ్ళీ టార్గెట్ చేశారు. మీ తమ్ముడు దగ్గర డబ్బులు అడుక్కుని టీ తాగి పడుకోండి అంటూ వర్మ నాగబాబుపై ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి ట్వీట్ లపై చర్చ జరుగుతుంది. రాంగోపాల్ వర్మ ని జనసైనికులు, నాగబాబును వైసిపి శ్రేణులు ఈ వ్యవహారంలో టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications