రంగా మీదున్న గౌరవంతో అవి చూపించలేదు, అవి చూపిస్తే: రాధాకి వర్మ కౌంటర్
'వంగవీటి' చిత్రం పైన తన మీద వస్తున్న విమర్శలకు రామ్ గోపాల్ వర్మ కూడా ఘాటుగా స్పందించారు.
విజయవాడ: 'వంగవీటి' చిత్రం పైన తన మీద వస్తున్న విమర్శలకు రామ్ గోపాల్ వర్మ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ చిత్రంలో వంగవీటిని కించపరిచారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఈ హెచ్చరికపై రామ్ గోపాల్ వర్మ స్పందించారని వార్తలు వస్తున్నాయి. రంగాగారి క్యారెక్టర్నీ వక్రీకరించానని రాధా కామెంట్లకు నా సమాధానం ఇది అంటూ పేర్కొన్నారు.
రంగా గారు బోసిపళ్ల మహాత్మా గాంధీ అని చూపించాలా?
మర్డర్ల మాట అటుంచి ఎవర్నీ మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా?
మదర్ థెరిస్సా కన్నా సాత్వికుడు అని చూపించాలా?
అన్నదానాలు, ప్రజా సేవ తప్ప చీమకైనా హానీ చేయని గౌతమ బుద్దుడు అని చూపించాలా? అని ఘాటుగా ప్రశ్నించారు.

వాస్తవాలు చూపించలన్న రాధాకృష్ణకు కౌంటర్ ఇచ్చారు. రంగా గారి గురించి, ఆయన భార్య గురించి రంగా గారి అభిమానులు వినడానికి, చూడటానికి ఇష్టపడని డాక్యుమెంటేడ్ వాస్తవాలు తాను చాలా చూపించగలనని, కానీ రంగా గారి మీద ఉన్న గౌరవంతో అవి చూపించలేదన్నారు.
దమ్ముంటే ఆ వాస్తవాలు ఏమిటని రాధా డిమాండ్ చేస్తే వాటిని అన్నింటిని కుండబద్దలు కొట్టినట్లు చూపిస్తానన్నారు. తాను ముందు నుంచి చెప్తున్నది వంగవీటి సినిమా తియ్యడంలో తన ఉద్దేశ్యం ఆ జీవిత కథల ఆధారంగా అప్పుడు జరిగిన ఆ ఘటనల వెనుక వాళ్ల సున్నితమైన భావోద్వేగాలను చూపించడం మాత్రమే అన్నారు.
ఒరిజినల్ వంగవీటి రాధా, వంగవీటి రంగా గార్లలో ఉన్న గొప్పతనంలో ఈ రాధాకృష్ణకు 0.1 శాతం కూడా లేకపోవడం మూలానే అతడి పరిస్థితి ఇలా ఉందన్నారు. ఏమీ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారన్నారు.
వంగవీటి సినిమా గురించి దుర్బుద్ధి ఉన్నవాళ్లు నా దురుద్దేశ్యం గురించి ఎంత అరిచినా, పచ్చి నిజం ఏమిటంటే రంగా గారి మీద రాధాకి, రత్నకుమారి గారికి ఉన్న గౌరవం కన్నా ఎన్నో రెట్లు తనకు ఉందన్నారు. తాను తీసిన సినిమా కరెక్ట్ కాదనుకుంటే అసలు వంగవీటి అని ఇంకో సినిమా తీసి లోకానికి చూపించండని సవాల్ చేశారు. రాధా తనకు వార్నింగ్ ఇచ్చారని, తన కౌంటర్ వార్నింగ్ ఇదేనంటూ.. 'బస్తీమే సవాల్.. సెంటర్ నేను చెప్పను, టైం నువు చెప్పవద్దు' అంటూ హెచ్చరించారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications