పవన్ గారు: వాళ్లను బస్సు టైర్ల కింద తొక్కించేయండి సార్..: ఆర్జీవీ సెటైర్లు మామూలుగా లేవుగా

అమరావతి: రాష్ట్ర రాజకీయాలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్లను సంధించడాన్ని బ్రేకుల్లేకుండా కొనసాగిస్తోన్నారు. ఇదివరకు చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీపై ఘాటు విమర్శలు చేశారు. అనంతరం తనను తప్పు పట్టిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై అదే రేంజ్ లో విరుచుకుపడ్డారు. సెటైర్లతో చెలరేగిపోయారు. ఇప్పుడు తాజాగా మరోసారి పవన్ కల్యాణ్‌ ను టార్గెట్ గా చేసుకున్నారాయన. వారాహి వాహనాన్నీ వదల్లేదు.

హిట్లర్ వాహనం..

హిట్లర్ వాహనం..

ఏపీ వ్యాప్తంగా నిర్వహించడానికి తలపెట్టిన బస్సు యాత్ర కోసం రూపొందించుకున్న వారాహి వాహనం, దాని డిజైన్ పై రామ్ గోపాల్ వర్మ విమర్శలు చేశారు. దాన్ని హిట్లర్ వాహనంగా అభివర్ణించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజల సందర్భంగా పవన్ కల్యాణ్ కాషాయ వస్త్రాలను ధరించడంపైనా కామెంట్స్ చేశారు ఆర్జీవీ. పవన్ కల్యాణ్ ను స్వామి వివేకానందుడిగా పేర్కొన్నారు. హిట్లర్ వాహనంపై స్వామి వివేకానందుడు.. అంటూ సెటైర్ వేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు పోస్ట్ చేశారు.

వారాహిని వరాహంగా..

వారాహిని వరాహంగా..

మరో ట్వీట్ లో వారాహి వాహనాన్ని వరహంగా అభివర్ణించారు. పంది వాహనంగా పేర్కొన్నారు. హిట్లర్, స్వామి వివేకానంద ఆయన కుడి, ఎడమ పాదాలను నొక్కుతారు.. పవర్ స్టార్ పవర్ అంటే అదేనంటూ చురకలు అంటించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చైతన్య రథం ప్రస్తావనను తీసుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ.

బస్సు టైర్ల కింద..

బస్సు టైర్ల కింద..

తెలుగుదేశం పార్టీని స్థాపించన మొదట్లో ఎన్టీఆర్ చైతన్య రథం మీద తిరిగితే, ఇప్పుడు పవన్ కల్యాణ్ పంది బస్సు మీద తిరుగుతున్నారు అంటూ విమర్శించే వారిని జనసేనలతో బస్సు టైర్ల కింద తొక్కించేయాలని, అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి అంటూ విజ్ఞప్తి చేశారు రామ్ గోపాల్ వర్మ. ఒక అభిమానిగా ఇది తన విన్నపం అని చెప్పారు.

గుడిలో ఉంటే..

గుడిలో ఉంటే..

గుడిలో ఉంటే అది వారాహి అవుతుందని, అదే రోడ్డు మీద ఉంటే అది పంది.. పీ, తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని, వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర వారాహిని ఒక పంది బస్సు గా ముద్ర వేస్తారని పవన్ కల్యాణ్ కు రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ గా సూచించారు. జనసైనికులను ఉద్దేశించి.. డియర్ జనసైనికులారా దయచేసి #PandhiBassuVaarahi హ్యాష్‌ట్యాగ్ ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండని సలహా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+