రాం గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాక్.. అరెస్ట్ తప్పదా!
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో దానిని కొట్టేయాలని రాంగోపాల్ వర్మ తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాం గోపాల్ వర్మకు హైకోర్టు లో చుక్కెదురు
విచారణ జరిగే సమయంలో అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ రాంగోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాంగోపాల్ వర్మ అభ్యర్థనను ఏపీ హైకోర్టు తోసి పుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే రేపు విచారణకు హాజరు కావాలని మద్దిపాడు పోలీసులు రాంగోపాల్ వర్మ కు నోటీసులు ఇచ్చారు.

మరికొంత సమయం కావాలన్న వర్మ.. కోర్టు ఏమందంటే
ఈ క్రమంలో పోలీసుల ముందు హాజరు అవ్వడానికి మరికొంత సమయాన్ని కూడా ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే హైకోర్టు సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసుల ముందే చేసుకోవాలని పేర్కొంది ఇటువంటి అభ్యర్థన ధర్మాసనం ముందు కన్నా పోలీసులు ముందే చేస్తే మంచిదని విచారణ జరిపిన న్యాయమూర్తి పేర్కొన్నారు.
19వతేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆర్జీవీకి నోటీసులు
రాంగోపాల్ వర్మ పైన మద్దిపాడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం క్రింద కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా పోలీసులు హైదరాబాద్లోని వర్మ నివాసానికి వెళ్లి ఆయనకు నోటీసులు అందజేశారు. ఈ నెల 19వతేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా అనుచిత పోస్టులు పెట్టిన వర్మ
వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా టిడిపి అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం, నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పైన, లోకేష్, నారా బ్రాహ్మణి పైన వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆర్జీవీ చేసిన అనుచిత పోస్టులపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇక వర్మ విచారణకు హాజరయితే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications