గన్నవరంలోనూ రామచంద్రపురం సీన్ రిపీట్ ? అయితే వైసీపీ లేదా ఇండిపెండెంట్ !

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. అంతే కాదు అధికార పార్టీ వైసీపీలోనూ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న పలు నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఎన్నికల వేళ బయటపడుతున్నాయి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపులన్నీ ఇప్పుడు స్వరం పెంచుతున్నాయి. అయితే వైసీపీ టికెట్ పై పోటీ చేస్తాం లేకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతామంటూ హెచ్చరిస్తున్నాయి.

తాజాగా కోనసీమ జిల్లా రామచంద్రపురం టికెట్ కోసం వైసీపీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణకూ, అదే పార్టీకి చెందిన రాజ్యసభఎంపీ, సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే రామచంద్రపురంలో వేణుకు టికెట్ ఖరారు చేయడంతో ఆగ్రహంగా ఉన్న పిల్లి.. తాను లేదా తన కుమారుడు అయితే వైసీపీ టికెట్ మీద లేకపోతే ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతామంటున్నారు. అంతే కానీ మంత్రి వేణుకు మద్దతిచ్చేది లేదంటున్నారు. ఇప్పుడు ఇదే సీన్ గన్నవరం నియోజకవర్గంలోనూ రిపీట్ అయింది.

vallabanenivamsiyarlagaddavenkatarao

గన్నవరంలో టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి అనుబంధంగా ఉంటున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జగన్ ఎప్పుడో టికెట్ ఖరారుచేసేశారు. అయినా ఆయనకు ప్రత్యర్ధులుగా ఉన్న వైసీపీ పాత వర్గం దుట్టా రామచంద్రరావు, గత ఎన్నికల్లో పోటీ చేసి వంశీ చేతిలో ఓడిన యార్లగడ్డ వెంకట్రావు తమకూ టికెట్ కావాలంటున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు మరోసారి పోటీ కోసం సిద్ధమవుతున్నారు. వంశీకి కాకుండా తనకు గన్నవరం టికెట్ కావాలంటున్న ఆయన.. రాకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానంటున్నారు. టీడీపీకి వెళ్తానన్న ప్రచారాన్ని మాత్రం ఆయన ఇవాళ ఖండించారు.

దీంతో ఇప్పుడు సిట్టింగ్ వంశీకి టికెట్ ఇవ్వాలా లేక గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావుకు ఇవ్వాలా అన్న దానిపై జగన్ కు సందిగ్ధం ఏర్పడుతోంది. అయితే ఇప్పటికే వంశీకి టికెట్ పై హామీ ఇచ్చిన జగన్ దాన్ని వెనక్కి తీసుకునే పరిస్దితి లేదు. కాబట్టి యార్లగడ్డను త్వరలో పిలిపించి మాట్లాడేందుకు సిద్దమవుతున్నారు. జగన్ తో భేటీలో ఆయన ఒప్పుకోకపోతే ఆ తర్వాత ఇక బుజ్జగించకుండా వదిలేసే అవకాశాలూ లేకపోలేదు. దీంతో యార్లగడ్డ కూడా వచ్చే ఎన్నికల కోసం తన వ్యూహాలు తాను సిద్ధం చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+