రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాంగోపాల్ వర్మ!!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. టిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేయడంలో ఆయన రూటే సపరేటు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి జైలు పాలైనప్పటినుండి చంద్రబాబును టార్గెట్ చేస్తూ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.
నిత్యం ఏదో ఒక విధంగా చంద్రబాబుపై విమర్శలు చేయడం, సెటైర్లు వేయడం రాంగోపాల్ వర్మ పనిగా పెట్టుకున్నారు. ఇక అంతే కాదు చంద్రబాబును డి మెరిట్ చేసేలా, జగన్ కు హైప్ క్రియేట్ చేసేలా వ్యూహం సినిమాతో రాంగోపాల్ వర్మ రచ్చ చేస్తున్నారు.తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట సెల్ఫీ తీసుకున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నాడన్న విషయం తెలిసిన ఆయన కావాలని రాజమండ్రి సెంట్రల్ జైలు ముందుకు వెళ్లి సెల్ఫీ తీసుకొని చంద్రబాబును టార్గెట్ చేశారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన ఆయన నేను రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఉంటే, ఆయన సెంట్రల్ జైలు లోపల ఉన్నారు అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ వేడుకలకు రాజమండ్రి వచ్చిన రామ్ గోపాల్ వర్మ తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు సెల్ఫీ దిగారు. అంతకుముందు చంద్రబాబును వదిలిపెట్టకుండా రాంగోపాల్ వర్మ చంద్రబాబును ఉద్దేశించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట సెల్ఫీ తీసుకున్న సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..!!#RGV #RamGoplaVarma #ChandrababuArrest #RajahmundryCentralJail #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/rayJuxQ1T3
— oneindiatelugu (@oneindiatelugu) October 26, 2023
తన భార్య గురించి ఎవరో ఏదో చెప్పారని చంద్రబాబు ఏడుస్తున్నాడని, చంద్రబాబు కొడుకు నారా లోకేష్ తన తండ్రిని జైల్లో పెట్టారని ఏడుస్తున్నాడని, యాదృచ్ఛికంగా తల్లి, భార్య కూడా ఏడుస్తూనే ఉన్నారని, చరిత్రలో ప్రజలు ఎప్పుడు బలమైన నాయకుల వైపే చూస్తారని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఎప్పుడు ఏడుపుగొట్టు నేతల వైపు ప్రజలు చూడరని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications