మరి రేషన్ బియ్యం ఏమైనట్లు?...కార్డుదారులకు ఇవ్వలేదు...డీలర్ల వద్దా లేవు

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

గుంటూరు జిల్లా: వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యం...అటు కార్డుదారులకు పంపిణీ చెయ్యలేదు...ఇటు డీలర్ల దగ్గరా లేవు...మరేమయ్యాయంటే...సమాధానమే లేదు...ప్రస్తుతం గుంటూరు జిల్లా రేషన్‌ షాపుల్లో పరిస్థితి ఇదీ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అక్రమాలు వెలుగుచూస్తున్నా అవి ఎక్కడ..ఎలా జరుగుతున్నాయో అధికారులు కనిపెట్టలేపోతుండటం విచారకరం.

ప్రతినెలా 1 నుంచి 15వ తేదీలోగా రేషన్‌ సరకుల పంపిణీ పూర్తి చేయాల్సి ఉంది. అయితే సగం కూడా సరుకులు పంపిణీ చెయ్యని రేషన్ షాపులపై జిల్లా సివిల్ సప్లయిస్ అధికారులు దాడులు నిర్వహించి తనిఖీలు ప్రారంభించారు. మూడు రోజులుగా జరుతుతున్నఈ సోదాల్లో అధికారులు ఎన్నో విచిత్రాలు గుర్తిస్తున్నారు.
ముఖ్యంగా రేషన్ బియ్యానికి సంబంధించి వందలాది క్వింటాళ్ల బియ్యం వ్యత్యాసం కనిపిస్తుండగా...వాటిని ఎక్కడికి...ఎలా...తరలిస్తున్నారనేది అధికారులకు అంతుచిక్కటం లేదని తెలుస్తోంది...వివరాల్లోకి వెళితే...

ఈ పోస్ యంత్రాల...డాటా ఆధారంగా...తనిఖీలు

ఈ పోస్ యంత్రాల...డాటా ఆధారంగా...తనిఖీలు

పౌర సరఫరాల శాఖలోకి ఆధునిక ఈపోస్‌ యంత్రాల రాకతో చౌకధరల దుకాణాల్లో ఎంత వరకు రేషన్‌ సరకులు పంపిణీ చేశారనేది ఆన్‌లైన్‌లో తెలిసిపోతోంది. దీంతో గుంటూరు జిల్లాలో పదో తేదీ వరకు కనీసం 50 శాతం రేషన్‌ సరకులు కూడా పంపిణీ చేయని దుకాణాలను ఎంపిక చేసుకుని సివిల్ సప్లయిస్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు.

 భారీగా అక్రమాలు...గుర్తింపు...

భారీగా అక్రమాలు...గుర్తింపు...

ఈ నెల 10 వ తేదీ నుంచి తనిఖీలు ప్రారంభించిన నేపథ్యంలో రేషన్ షాపుల నుంచి సరుకుల పంపిణీ 50 శాతం కంటే తక్కువగా ఉన్న వాటిలో పరిశీలించగా అక్కడ వందల క్వింటాళ్లు బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. కేవలం రేషన్ బియ్యమే కాకుండా జనవరి నుంచి పంపిణీ చేస్తున్న పంచదారను కూడా డీలర్లు పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. వీరందరిపై 6ఏ కేసులు నమోదు చేసి, జిల్లా సంయుక్త కలెక్టర్‌ కోర్టుకు హాజరుపరుచనున్నట్లు డీఎస్‌వో చిట్టిబాబు, ఏఎస్‌వో ఈబి విలియమ్స్‌ తెలిపారు.

 వివిధ దుకాణాల్లో...సరుకు మాయం...

వివిధ దుకాణాల్లో...సరుకు మాయం...

గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుతోటలో ఉన్న155 నంబరు దుకాణంలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో దుకాణంలో డీలరు వద్ద ఉండాల్సిన స్టాకు కంటే 111 క్వింటాళ్ల బియ్యం తగ్గింది. అదేవిధంగా గుంటూరువారి తోటలోని 85 వ నంబరు దుకాణంలో 2,890 కిలోల బియ్యంకు గాను డీలరు వద్ద కేవలం 270 కిలోలే ఉన్నాయి. మిగిలిన 2620 కిలోల బియ్యం అతని వద్ద అంతు లేవు. ఇక్కడ పంచదార కూడా ఉండాల్సిన 134 కిలోల స్టాకుకు గాను కేవలం46 కిలోలే ఉంది. కిరోసిన్‌ది అదే పరిస్థితి...347 లీటర్లకు గాను అసలు స్టాకే లేదు...ఇక 88వ నంబర్ దుకాణంలో 35 క్వింటాళ్లకు గాను ఒక్క బస్తాం బియ్యం కూడా లేకపోవటంతో అధికారులు విస్తుపోయారు. ఇదే దుకాణంలో 101 కిలోల పంచదార, కిరోసిన్‌ ఓల్డ్ స్టాక్ 74 లీటర్లు కూడా డీలరు వద్ద లేదని అధికారులు గుర్తించారు.

 అధికారుల తీరుపై...ఆరోపణలు...

అధికారుల తీరుపై...ఆరోపణలు...

అయితే రేషన్ షాపుల్లో సరుకు మాయంపై అధికారులు ఆశ్చర్యపోతుంటే సాధారణ జనాలు మాత్రం అధికారులపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. రేషన్ డీలర్ల మాయాజాలం గురించి అనేక సందర్భాల్లో అధికారులకు ఫిర్యాదు చేసినా అక్రమాలకు ఆస్కారం లేదని కొట్టిపడేసేవారని...ఇప్పుడేమో కొత్తగా కనిపెట్టినట్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. సరుకు ఎక్కడకు ఎలా తరలి వెళుతుందో అధికారులు కనిపెట్టాలంటే పెద్ద పనేం కాదని...పైగా ఇవే అక్రమాలు ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నాయంటే ఎంత భారీ స్థాయిలో అవినీతి జరిగి ఉంటుందో అర్ధం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...ఇప్పటికైనా అధికారులు తాము గుర్తించిన అక్రమాలను బహిర్గత పరిచి...అలాంటి వారిని కఠినంగా శిక్షించినప్పుడే ఈ అవినీతికి అడ్డుకట్ట పడుతుందని సూచిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Guntur District: In a shocking turn of events, it has been found that some dealers are diverting the pds rice by the Civil Supplies Department.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి