Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముద్దన్న లేరంటే బాధగా ఉంది: రావుల, మచ్చలేని నాయకుడని జగన్ పార్టీ నేత పెద్దిరెడ్డి

Recommended Video

    Former AP Minister and TDP MLC Gali Muddukrishnama Naidu Lost Life

    హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మృతి తీరని లోటు అని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. గాలి ముద్దుకృష్ణమ భౌతిక కాయానికి టీడీపీ నేతలతోపాటు ఇతర పార్టీల నేతలు నివాళులు అర్పించారు.

    అనంతరం ఎల్ రమణ మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్ణకరమైన రోజని అన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి గాలి ముద్దుకృష్ణమ అని కొనియాడారు.

    వాస్తవాలు నిర్మొహమాటంగా..

    వాస్తవాలు నిర్మొహమాటంగా..

    ముద్దుకృష్ణమ.. వాస్తవాలను నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి అని అన్నారు. చిత్తూరు జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి గాలి సేవలు ఎనలేనివని ఎల్ రమణ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో తమలాంటి వారిని ప్రోత్సాహం ఇచ్చేవారని రమణ తెలిపారు.

    ముద్దన్న లేరంటే బాధగా..

    ముద్దన్న లేరంటే బాధగా..

    ముద్దన్న అంటూ ప్రేమగా పిలిచే వ్యక్తి ఇక లేరంటే ఎంతో బాధగా ఉందని మరో నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌కు అత్యంత ఆత్మీయుడిగా, రాజకీయాల్లో ఎందరికో ప్రోత్సాహం, స్ఫూర్తిని ఇచ్చిన వ్యక్తని చెప్పారు. గాలి ముద్దుకృష్ణమ మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అన్నారు. భగవంతుడు ఆ కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని చెప్పారు.

    చివరి వరకూ అదే పేరు

    చివరి వరకూ అదే పేరు


    తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంచి రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి చివరి వరకూ మంచి పేరు నిలుపుకున్నారని ఆయన అన్నారు.

    మచ్చలేని నాయకుడంటూ పెద్దిరెడ్డి

    మచ్చలేని నాయకుడంటూ పెద్దిరెడ్డి

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్ది రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరుతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు ముద్దు కృష్ణమనాయుడని అన్నారు. గాలి పార్థీవ దేహాన్ని ఆయన సందర్శించి నివాళర్పించారు. గాలి తన జీవితంలో అవినీతి, లంచగొండితనానికి ఆస్కారం లేకుండా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు. గాలి లేని లోటు తీరనిదని, ఆయన కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. కాగా, గాలి ముద్దుకృష్ణమ పార్థీవ దేహానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+