గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాయ‌పాటికి జ‌ల‌క్‌..సీటు రద్దు..! : న‌ర్స‌రావుపేట ఎంపీగా కొత్త అభ్య‌ర్ది: టిడిపి లో క‌ల‌క‌లం..!

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లా సీనియ‌ర్ రాజ‌కీయ‌నేత రాయ‌పాటి కి టిడిపి మ‌రో జ‌ల‌క్ ఇచ్చింది. ఇప్ప‌టికే ఆయ‌న్ను న‌ర్స‌రావుపేట ఎంపీగా ఖ‌రారు చేసిన టిడిపి అధినాయ‌క‌త్వం ఇప్పుడు అక్క‌డ అభ్య‌ర్ధి మార్పు పై దృష్టి సారించింది. న‌ర్స‌రావుపేట అభ్య‌ర్ది భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామ‌కృష్ణ‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. అదే విధంగా ఈ నియోజ‌క‌వ‌ర్గం మార్పును దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ఇద్ద‌రు అభ్య‌ర్ధుల మార్పు పై దృష్టి సారించింది.

రాయ‌పాటికి సీటు ర‌ద్దు..!
గుంటూరు జిల్లాలో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌. ఆయ‌న అయిదు సార్లు పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ప‌ని చేసారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ నుండి టిడిపి లో చేరి న‌ర్స‌రావు పేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆయ‌న పోల‌వ‌రం కాంట్రాక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు తొలుత న‌ర్స‌రావుపేట సీటు ఇవ్వ టానికి టిడిపి అధినాయ‌క‌త్వం సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదు. దీంతో..ఆయ‌న టిడిపి వీడ‌టానికి సిద్ద‌మ‌య్యారు.

దీంతో దిగి వ‌చ్చిన టిడిపి ఆయ‌న‌కు న‌ర్స‌రావుపేట లోక్‌స‌భ సీటు ఖ‌రారు చేసింది. ఈ నిర్ణ‌యం తో రాయ‌పాటి మెత్త‌బ‌డ్డారు. ఇక‌, వైసిపి లిస్టు ప్ర‌క‌ట‌న పూర్త‌యిన త‌రువాత ఇప్పుడు టిడిపి లిస్టులో మార్పులు చేస్తున్నారు. న‌ర్స‌రావు పేట లోక్ స‌భ స్థానం నుండి రాయ‌పాటి ని త‌ప్పించి ఆయ‌న స్థానంలో భాష్యం విద్యా సంస్థ‌ల అధినేత భాష్యం రామ‌కృష్ణ కు సీటు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో రాయ‌పాటి స్థానంలో ఆయ‌న త‌న‌యుడుకి సీటు పైనా దృష్టి సారించారు.

బాల‌కృష్ణ పై పోలీసు అధికారి : లోకేష్ పై ఆళ్ల :కృష్ణా లో కాపు-క‌మ్మ వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్యం ..!బాల‌కృష్ణ పై పోలీసు అధికారి : లోకేష్ పై ఆళ్ల :కృష్ణా లో కాపు-క‌మ్మ వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్యం ..!

Rayapati seat cancelled : TDP Hi command new decision..

జిల్లాలో రెండు సీట్ల మార్పు..
ఇక‌, రాయ‌పాటి కి కేటాయించిన సీటు ర‌ద్దు చేయ‌టం తో పాటుగా జిల్లాలో రెండు సీట్ల మార్పు పై క‌స‌ర‌త్తు జ‌రుగుతు న్నట్లుగా విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇప్ప‌టికే గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్దిగా ప్ర‌క‌టించిన మ‌ద్దాల గిరిని అక్క‌డి నుండి న‌ర్స‌రావుపేట అసెంబ్లీ స్థానం సీటు మ‌ర్చాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌, రాయ‌పాటి ని బుజ్జ గించేందుకు ఆయ‌న త‌న‌యుడు రాయ‌పాటి రంగారావు కు గుంటూరు ప‌శ్చిమ సీటు కేటాయించే విధంగా క‌స‌ర‌త్తు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సీటు కేటాయింపు పై మ‌ద్దాలి గిరి అసంతృప్తితో ఉన్నారు.

తాను న‌ర్సరావు పేట అ సెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు సిద్దంగా లేన‌ని అంటున్నారు. అయితే, ఇప్పుడు ప్ర‌క‌టించిన అభ్య‌ర్ది మార్పు పై గుంటూరు ఎంపి అభ్య‌ర్ధి గ‌ళ్లా జ‌య‌దేవ్ సైతం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో..ఇప్పుడు ఈ మార్పుల పై టిడిపి అధినాయ‌క‌త్వం తుది నిర్ణ‌యం ఏ ర‌కంగా తీసుకుంటుందో అనేది ఆస‌క్తి క‌రంగా మారుతోంది.

English summary
TDP High command decided to change Narasarao pet Mp candidate. TDP first announce Rayapati Samba Siva rao as Narasa rao pet Mp candidate, now this may allot to Ramakrishna. In guntur dist two assembly segments candidates may change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X