Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టార్ హీరోలను మించి.. ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

రీల్ లైఫ్ విలన్ రియల్ లైఫ్ హీరో సోను సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇటీవల వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన వేళ వారి కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చారు. గతంలో కరోనా మహమ్మారి సమయంలో నేనున్నానంటూ వలస కార్మికులకు భరోసానిచ్చి ఎంతోమందిని ఆదుకున్న సోనూసూద్ తన సేవా కార్యక్రమాలతో భారత దేశ ప్రజలతో మన్ననలు పొందుతున్నారు.

గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్
ఇక తాజాగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిన సినీనటుడు, గొప్ప మానవతావాది సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. చాలామంది హీరోల కంటే భారీ మొత్తంలో విరాళాన్ని ప్రకటించి ఆయన తన పెద్ద మనసును మరొక మారు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వరద బాధితులు ఎవరైనా ఎలాంటి సహాయం కావాలన్నా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా పొందవచ్చునని [email protected] ను సంప్రదించాలని సూచించారు.

Real hero Sonu Sood who announced massive flood aid to AP and Telangana donated 5 crore rupees

తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన సోనూ సూద్
ఇప్పటికే వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తున్నారు. నివాసం కోల్పోయిన వారికి తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ కు సంబంధించిన వ్యక్తులు ఈ మేరకు సేవలు చేస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సోను సూద్ భారీగా విరాళం ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల విరాళం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరొక 2.5 కోట్ల రూపాయలు చొప్పున విరాళం ప్రకటించారు. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా తమ బృందాలు పనిచేస్తాయని సోనుసూద్ పేర్కొన్నారు.

సోనూ సూద్ కు పవన్ కళ్యాణ్ థాంక్స్
ఇక సోను సూద్ ప్రకటన పట్ల ఏపీ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు కష్ట కాలంలో ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ తోడ్పాటు బలాన్ని ఇస్తుందని ఆయన సోను సూద్ విషయంలో కొనియాడారు. సోను సూద్ ఇచ్చిన ఈ భారీ విరాళం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+