వినాయక చవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు: అరెస్ట్
విజయవాడ: వినాయక చవితి వేడుకలను భక్తిప్రపత్తులతో నిర్వహించాల్సి ఉండగా.. ఇక్కడ మాత్రం అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారు. దీంతో పోలీసులు అక్కడి వచ్చి అడ్డుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. విజయవాడ శివారులో నున్న సమీపంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, కొందరు యువకులు మహిళలను తీసుకొచ్చి గురువారం రాత్రి అశ్లీల నృత్యాలు చేయించారు.

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిర్వాహకులతోపాటు అశ్లీల నృత్యాలు చేస్తున్న నలురురు మహిళలను అరెస్ట్ చేశారు. 8మంది యువకులపై 290, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications