రూ.499కే స్మార్ట్ ఫోన్.. అమెజాన్ లో ఆఫర్
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే ప్లానింగ్ లో ఉన్నవారికి శుభవార్త. అమెజాన్ లో భారీ డిస్కౌంట్ తో రెడ్ మి ఫోన్ అందుబాటులో ఉంది. అత్యంత చౌక ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. రెడ్‌మి 12సీ ఫోన్‌పై ఉన్న డీల్ ను కొత్తగా ఫోన్ కొనేవారు ఒకసారి పరిశీలించొచ్చు.
4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్ రెడ్‌మి 12సీ ఫోన్‌లో ధర రూ. 8,999గా ఉంది. సాధారణంగా అయితే రూ. 13,999 దీని ధర. 36 శాతం డిస్కౌంట్ పై రూ.8999కి ఇస్తున్నారు. ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్ ఉంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొంటే రూ. 500 డిస్కౌంట్ ఇస్తారు. అప్పుడు దీని ధర రూ. 8,500 అవుతుంది.

ఈ ఫోన్‌పై మరో ఆఫర్ కూడా ఉంది. రూ. 8,500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తోంది. అంటే కేవలం రూ. 499 చెల్లించి పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ తీసుకోవచ్చు. పాత ఫోన్ ఆధారంగా ఎక్స్చేంజ్ విలువ మారుతుంది. మీ ఫోన్‌కు తక్కువ విలువ కూడా రావొచ్చు. అప్పుడు మాత్రం చేతి నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది.
తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలవారీ ఈఎంఐ రూ. 430 నుంచి ప్రారంభమవుతోంది. 24 నెలల టెన్యూర్ పెట్టుకోవచ్చు. 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 566 చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరం టెన్యూర్ అయితే రూ. 816, 9 నెలలైతే రూ.1068 చెల్లించాలి. నో కాస్ట్ ఈఎంఐ సౌలభ్యం కూడా ఉంది. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకున్న తర్వాత నెలకు రూ. 1500 పడుతుంది. మూడు నెలల టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 4 వేలచొప్పున చెల్లించాల్సి ఉంటుంది. బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా కూడా నో కాస్ట్ ఈఎంఐ సౌలభ్యాన్ని పొందొచ్చు.












Click it and Unblock the Notifications