కుటుంబ సభ్యులందరికీ ఒకటే జియో ప్లాన్
ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కచ్చితంగా స్మార్ట్ ఫోన్లుంటాయి. ప్రతి ఫోన్ లోను రెండు నెంబర్లు ఉంటాయి. వీటిని రీఛార్జి చేయిస్తుండాలి. ఇలా కుటుంబ సభ్యులందరికీ ఒకేసారి రీఛార్జ్ లు చేయించడం భారంగా మారుతుంటుంది. అందరికీ కలిపి ఒకటే ప్లాన్ ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన వస్తుంది. ఇలా కోరుకునేవారి కోసం రిలయన్స్ జియో ఒక మంచి ప్లాన్ తీసుకొచ్చింది. జియో ఫ్యామిలీ ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభమవుతాయి. ఒకే ప్లాన్ పై నాలుగు సిమ్ కార్డులు ఉపయోగించవచ్చు. దీనిలో అదనంగా ఎటువంటి లాభాలున్నాయో తెలుసుకుందాం.
Jio Rs.399: ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి ఒక సిమ్ కార్డు లభిస్తుంది. నెలకు రూ.399 చెల్లిస్తే 75 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, అన్ లిమిటెడ్ 5జీ డేటా ఉచితం.

Jio Rs.498: ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి ఒక ప్రైమరీ సిమ్ కార్డుతోపాటు యాడ్ ఆన్ సిమ్ కార్డు కూడా లభిస్తుంది. నెలకు రూ.498 చెల్లించాలి. ఇద్దరు ఉపయోగించుకోవచ్చు. ఒక్కొక్కరికి నెలకు రూ.249 అవుతుంది. 80 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్ తోపాటు అన్ లిమిటెడ్ 5జీ డేటా ఉచితం.
Jio Rs.597: ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి ఒక ప్రైమరీ సిమ్ కార్డుతోపాటు రెండు యాడ్ ఆన్ సిమ్ కార్డ్స్ లభిస్తాయి. నెలకు రూ.597 చెల్లించాలి. ముగ్గురు వ్యక్తులు వీటిని ఉపయోగించుకోవచ్చు. నెలకు ఒకరికి రూ.197 అవుతుంది. మొత్తం 85 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్ తోపాటు అన్ లిమిటెడ్ 5జీ డేటా ఉచితం.
Jio Rs.696: ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి ఒక ప్రైమరీ సిమ్ కార్డుతోపాటు మూడు యాడ్ ఆన్ సిమ్ కార్డ్స్ లభిస్తాయి. నెలకు రూ.696 చెల్లించాలి. నలుగురు వ్యక్తులు ఉపయోగించుకోవచ్చు. నెలకు ఒకరికి రూ.174 చొప్పున పడుతుంది. మొత్తం 90 జీబీ డేటా ఇస్తారు. అన్ లిమిటెడ్ కాల్స్ తోపాటు అన్ లిమిటెడ్ 5జీ డేటా ఉచితం.












Click it and Unblock the Notifications