Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అల్లు అర్జున్‍ తగ్గేదేలే.. యువతపై పవన్ కళ్యాణ్ సంచలనం.. నా ముందు కాదంటూ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో ఎండను సైతం లెక్క చేయకుండా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని, పదేళ్లుగా పోరాటం చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు.

జనసేన పార్టీ కంటే ఏపీ ప్రజల సంక్షేమమే ముఖ్యం
తాను ఈ ఎన్నికల్లో పొత్తులతో వెళ్తుంది కేవలం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల బాగు కోసమని, తప్పనిసరిగా ఆదరించాలని అంటున్నారు. తనకు జనసేన పార్టీ కంటే ఏపీ ప్రజల సంక్షేమమే ముఖ్యమని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో తన సభలకు వచ్చే జనాలు, యువత తమ అభిమానం ఓటు రూపంలో చూపించాలన్నారు. వైసీపీని గద్దె దించాలన్నారు.

Remembering Allu Arjun Pawan Kalyan sensational comments on youth

అల్లు అర్జున్ ఫోటోలతో తగ్గేదేలే అంటున్న యువత
ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో "వారాహి విజయభేరి" బహిరంగ సభలో పోటెత్తిన యువతరాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండపేటలో జరిగిన వారాహి విజయభేరి బహిరంగ సభలో అల్లు అర్జున్ ఫోటోలు పట్టుకొని తగ్గేదే లేదంటూ హంగామా చేశారని చెప్పుకొచ్చారు.

అయితే నా ముందు కాదు చెప్పాల్సింది అన్న పవన్
యువత తగ్గేదే లేదంటే చాలా సంతోషమని పేర్కొన్న పవన్ కళ్యాణ్ అయితే ఆ విషయాన్ని తనకు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని ఎన్నికల రోజు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పాలని, అక్కడ తగ్గేదే లేదని నిన్ను కిందికి దించుతామని చెప్పాలని యువతను కోరారు. ఇక అల్లు అర్జున్ సినిమాలోలా తగ్గేదే లేదని చేసే వ్యాఖ్యలు నా ముందు కాదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

పవన్ వ్యాఖ్యల వెనుక
పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలను బట్టి తన సభలకు వస్తున్న యువత తనను చూసి చేస్తున్న హంగామాని పక్కనపెట్టి, పోలింగ్ రోజున ఓటు రూపంలో తనపై ఉన్న ప్రేమను చూపించాలనే ప్రధాన ఉద్దేశం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనూ పవన్ కళ్యాణ్ సభలకు పోటెత్తిన ప్రజలు ఎవరు ఆయనను గత ఎన్నికల్లో ఆదరించలేదు. దీంతో పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయనలో అంతర్గతంగా ఉన్న భయాన్ని కూడా ప్రస్ఫుటంగా చెబుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+