నాడు ట్రోల్స్- నేడు ఢిల్లీ వేదికగా సెల్యూట్స్: హేటర్స్‌కు చెంపదెబ్బ

Nadu Nedu: దేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన పరేడ్ వైభవంగా సాగింది. కర్తవ్యపథ్ జనమం అయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిమంది ప్రజలు ప్రత్యక్షంగా ఈ వేడుకలను తిలకించారు.

ఈ సారి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆర్మీ జవాన్లు నిర్వహించిన కవాతు కట్టిపడేసింది. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన విమెన్ బ్యాండ్ మొట్టమొదటిసారిగా ఈ పరేడ్‌లో భాగస్వామ్యం అయింది. ఫ్రాన్స్ సైన్యానికి చెందిన బ్యాండ్ ట్రూప్ కవాతు నిర్వహించింది.

Republic Day 2024: Andhras tableau showcased the transformation of the school education

వివిధ రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. ఏపీ, తెలంగాణ సహా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిషా, మణిపూర్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా నుంచి వచ్చిన శకటాలు.. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రతిబింబించాయి.

Republic Day 2024: Andhras tableau showcased the transformation of the school education

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేయడానికి జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న నాడు- నేడుతో రూపుదిద్దుకున్న ఏపీ శకటం కట్టిపడేసింది. ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మేకింగ్ స్టూడెంట్స్ గ్లోబల్లీ కాంపిటిటీవ్ థీమ్‌తో దీన్ని తయారు చేసింది ప్రభుత్వం.

Republic Day 2024: Andhras tableau showcased the transformation of the school education

విద్యా వ్యవస్థలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, విద్యార్థులకు ట్యాబ్‌లు, డిజిటల్ విద్యా విధానానికి ప్రొత్సాహం.. వంటి అంశాలతో ఈ శకటానికి రూపకల్పన చేశారు.

గతంలో ఇంగ్లీష్‌లో మాట్లాడినందుకు బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులను తెలుగుదేశం అనుబంధ సోషల్ మీడియా ఐటీడీపీ ఏ స్థాయిలో ట్రోల్స్ చేశారో తెలిసిందే. అలాంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ఇప్పుడు దేశ రాజధాని వేదికగా సగర్వంగా రిపబ్లిక్ డే వేడుకల్లొోో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+