సంక్రాంతికి సొంతూళ్లుకు వెళ్లు ప్రయాణీకులకు రైల్వే కీలక అప్డేట్..!!
సంక్రాంతికి ప్రయాణాలకు రిజర్వేషన్లు మొదలయ్యాయి. విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లకు ఒక్క సారిగా డిమాండ్ పెరిగింది. ముందస్తు రిజర్వేషన్‌కు విండో తెరుచుకోవడంతోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. జనవరి 9వ తేదీకి (శుక్రవారం) సంబంధించిన టికెట్లు అప్పుడే పూర్తయిపోయాయి. వందేభారత్ రైళ్లలో ఉదయం పూట రైలుకు టికెట్లు అందుబాటులో ఉండగా సాయంత్రం రైలుకు వెయిటింగ్ లిస్ట్ జాబితా చూపిస్తోంది. దీంతో.. సంక్రాంతికి మిగిలిన రోజుల్లో రిజర్వేషన్ల పైన రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
సంక్రాంతికి రైల్వే ప్రయాణీలకు నుంచి భారీ డిమాండ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల మధ్య పలు ప్రధాన రైళ్లకు ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే గోదావరి రైలుకు టికెట్ల జారీ పరిమితి మించిపోయి రిగ్రెట్ చూపిస్తోంది. ప్రధానంగా ఈ రెండు స్టేషన్ల మధ్య నడిచే 2 వందేభారత్ రైళ్లలో ఉదయం పూట రైలుకు టికెట్లు అందుబాటులో ఉండగా సాయంత్రం రైలుకు వెయిటింగ్ లిస్ట్ జాబితా చూపిస్తోంది.

ఇవి మాత్రమే కాదు గరీబ్‌రథ్, ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, మహబూబ్‌నగర్ -విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ జాబితా దాటేసి ఇప్పుడు రిగ్రెట్ చూపిస్తోంది. స్లీపర్, థర్డ్ ఏసీ, 2ఏసీ, ఫస్ట్ ఏసీ అనే వ్యత్యాసం లేకుండా అన్ని సీట్లూ పూర్తిగా బుక్ అయిపోయాయి. అదే రోజు ఉదయం పూట బయల్దేరే జన్మభూమి, కోణార్క్, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మాత్రం ఇంకా వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది.
జనవరి 13, 14, 15 తేదీల్లో ఈ సారి భోగీ, సంక్రాంతి, కనుమ పండగలు వస్తున్నాయి. సాధారణంగా రెండ్రోజుల ముందు నుంచే సందడి ఉండడం సహజం. అయితే ఈసారి 10, 11వ తేదీల్లో శని, ఆదివారాలు రావడంతో రిజర్వేషన్ల సందడి ముందే మొదలైంది. ప్రయాణ తేదీకి దాదాపు 60 రోజుల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకునేందుకు రైల్వే శాఖ వెసులుబాటు కల్పిస్తోంది. ఇంతకు ముందైతే ఈ గడువు 120 రోజులుగా ఉండేది. రైల్వే శాఖ తాజాగా ఈ గడువును తగ్గించింది. దాని ప్రకారం జనవరి 10వ తేదీకి నవంబర్ 11వతేదీన, 11వ తేదీకి నవంబర్ 12కి, 12వ తేదీకి నవంబర్ 13వ తేదీన రిజర్వేషన్ విండో తెరుచుకోనుంది. ఉదయం 8 గంటలకే ముందస్తు రిజర్వేషన్ టికెట్ విండో ఓపెన్ అవుతున్న విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్












Click it and Unblock the Notifications