సిల్వర్ స్క్రీన్ పై సీఎం జగన్ - ఆర్జీవీ "వ్యూహం" లో ఆ ఇంట్రస్టింగ్ ఎపిసోడ్..!!

RGV -CM Jagan Bio Pic: సీఎం జగన్ రాజకీయ జీవితం వెండితెరకు ఎక్కనుంది. సంచలన దర్శకుడు ఆర్జీవీ "వ్యూహం" పేరుతో జగన్ పొలిటికల్ లైఫ్ చిత్రీకరిస్తున్నారు. కొద్ది నెలల క్రితం తాడేపల్లిలో ఆర్జీవీ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే జగన్ పొలిటికల్ లైఫ్ కు సంబంధించి తనకు కావాల్సిన సమాచారం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్ ఫైట్ ను రీల్ స్టోరీగా తెరకెక్కించేందుకు సర్వం సిద్దమైంది. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. "వ్యూహం" పైన ఆర్జీవీ ఇదే సమయంలో క్లారిటీ ఇచ్చారు. ఇది జగన్ బయోపిక్ కాదన్నారు. జగన్ కు సంబంధించిన ఈ మూవీలో ఏం ఉండేదీ క్లారిటీ ఇచ్చారు.

సీఎం జగన్ బయోపిక్ పై ఆర్జీవీ క్లారిటీ

సీఎం జగన్ బయోపిక్ పై ఆర్జీవీ క్లారిటీ

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ సీఎం జగన్ రాజకీయ పోరాటం వెండితెర కు ఎక్కించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు "వ్యూహం" గా పేరు ఖరారు చేసారు. ఈ సినిమా సీఎం జగన్ బయోపిక్ గా ఉంటుందనే ప్రచారాన్ని ఆర్జీవి ఖండించారు. ఇది జగన్ బయోపిక్ కాదని..ఆయన ఎక్కడ పుట్టారు.. ఎక్కడ పెరిగారు వంటి అంశాలు ఈ సినిమాలో ఉండవని స్పష్టత ఇచ్చారు. ఈ సినిమా రెండు పార్టులుగా ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమా పూర్తిగా జగన్ రాజకీయ పోరాటం ఆధారంగానే సినిమా తీస్తున్నట్లు తేల్చి చెప్పారు. అందులో భాగంగా 2009 లో వైఎస్సార్ మరణం నుంచి 2019లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం వరకు అన్ని అంశాలు ఉంటాయని వివరించారు.

కేసుల వ్యవహారం పై ఆసక్తికరంగా..

కేసుల వ్యవహారం పై ఆసక్తికరంగా..

వైఎస్సార్ మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాలను ఈ సినిమాలో చూపించనున్నారు. పావురాల గుట్ట వేదికగా నాడు సీఎం చేసిన ప్రకటన, ఆ తరువాత నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ సమయంలో ఏం జరిగిందీ వివరించనున్నారు. కాంగ్రెస్ ను వీడిన తరువాత జగన్ పైన కేసుల నమోదు అంశాన్ని ఆర్జీవీ తన సినిమాలో ఆసక్తి కరంగా మలిచేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ - టీడీపీ నేతలు కలిసి కేసు దాఖలు చేయటం..సీబీఐ విచారణ..జగన్ ను జైలుకు పంపటం వంటి వాటిని ఉన్నది ఉన్నట్లుగా వెండి తెరపైకి ఎక్కించేందుకు సిద్దమయ్యారు. జగన్ వైసీపీ నుంచి కడప ఎంపీగా దేశంలోనే రికార్డు మెజార్టీ 5.35 లక్షల ఓట్లతో గెలిచిన తీరును ఈ సినిమా ద్వారా మరోసారి తెర మీదకు తీసుకురానున్నారు. ఆ తరువాత ఉప ఎన్నికల్లో గెలిచిన విధానం.. ఓదార్పు యాత్ర తో పాటుగా 2014 ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణమాల వరకు తొలి ఎపిసోడ్ గా సిద్దం చేస్తున్నారు.

ప్రతిపక్ష నేత టు సీఎంగా.. రియల్ హీరోగా

ప్రతిపక్ష నేత టు సీఎంగా.. రియల్ హీరోగా

వ్యూహం రెండో పార్టులో ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన రాజకీయ పోరాటం చిత్రీకరించనున్నారు. అదే విధంగా ఇక రెండో ఎపిసోడ్ మొత్తంగా జగన్ పాదయాత్రను ప్రధానంగా తెరకెక్కించనున్నారు. పాదయాత్ర సమయంలో జగన్ ఏ విధంగా ప్రజలకు దగ్గరయిందీ రియల్ సీన్లను సినిమాలో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఇక, జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం అంశాన్ని మరోసారి వెండి తెర పైన ప్రదర్శించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. 2009 - 2019 మధ్య కాలంలో జగన్ రాజకీయ జీవితంలో చోటు చేసుకున్నవి..జరిగినవి జరిగినట్లుగా వెండి తెర పైకి రానున్నాయి. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ యాత్ర మూవీ రాగా..2024 ఎన్నికల వేళ "వ్యూహం" ఆసక్తి పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+