ఎన్డీఏ అంటే 'నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడం' - రోజా
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంపై అధికార టీడీపీ కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం కేసు వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు.
నగరిలో మీడియాతో మాట్లాడిన ఆర్కే రోజా, ఏపీలో ఎన్డీఏ కూటమిని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడం... అంటే దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని, రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి పని చేస్తోందని రోజా ఎద్దేవా చేశారు.

కల్తీ మద్యం తయారు చేసేది, బెల్ట్ షాపులు, బార్లు ద్వారా ప్రజల వద్దకు చేర్చేది మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులేనని రోజా ఆరోపించారు. ప్రభుత్వ సపోర్ట్ లేకుండా మొలకలచెరువు నుంచి చంద్రబాబు ఇంటి వరకు అక్రమ వ్యాపారం జరిగే పరిస్థితి లేదు. సాక్ష్యాలతో సహా పచ్చ బ్యాచ్ దొరికిపోయింది" అన్నారు.
ఆడదాని పుట్టుకనే అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. మహిళల పసుపు కుంకాలు, మంగళ సూత్రాలు మట్టిలో తొక్కుతూ సిగ్గులేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు మొదటి నుంచీ మహిళా ద్రోహి అంటూ ఘాటు విమర్శలు చేశారు.
చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చాకే కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగాయని, దీనివల్ల మహిళల మాన, ప్రాణాలకు హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాదిలో 21% గంజాయి డ్రగ్స్ కేసులు పెరిగాయని తెలిపారు.
నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమీషన్లను బయటకు తీయాలని ప్రధాని మోదీకి రోజా చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. మైనర్స్, వైన్స్ లో మంత్రి కొల్లు రవీంద్ర గ్యాంగ్ రెచ్చిపోతోంది. వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ తప్పనిసరి అని డిమాండ్ చేశారు.
నకిలీ మద్యం కేసు మూలం అయిన సురేంద్ర నాయుడు అనే వ్యక్తి లోకేష్‌కి సన్నిహితుడని రోజా ఆరోపించారు. కట్టా సురేంద్ర అనే వ్యక్తి 2006లో హత్య కేసులో జీవితకాల శిక్ష పడిన వ్యక్తి అని, చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక అతడికి క్షమాభిక్ష పెట్టి బయటకు తీసుకువచ్చారని ఆరోపించారు. చంద్రబాబు క్రిమినల్స్‌కు ఆశ్రయం ఇచ్చారంటూ రోజా తీవ్రంగా మండిపడ్డారు. తప్పుడు పనులు చేసి దొరికిపోతే వైఎస్సార్‌సీపీ కోవర్టులని చెప్పి తప్పించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications