అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్థి మృతి, శోకసంద్రంలో తల్లిదండ్రులు

Subscribe to Oneindia Telugu

చిత్తూరు: అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుకు చెందిన విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మరో మూడు నెలల్లో ఇంటికి వస్తాడని అనుకుంటున్న తరుణంలో అతని మరణవార్త విన్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. అమెరికాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వడమాలపేట మండలం ఎస్‌బీఆర్‌ పురం గ్రామానికి చెందిన అడ్లూరు చంద్రశేఖర్‌రాజు, సుహాసిని దంపతుల కుమారుడు సాయికుమార్‌ మృతి చెందాడు. వీరికి ఇద్దరు కుమారులు సాయికుమార్‌, మోహన్‌వంశీ. పెద్ద కుమారుడు సాయికుమార్‌ చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు.

Road accident in America: A telugu student killed

ఎంఎస్‌ చదువుకునేందుకు అమెరికా వెళ్లాడు. అమెరికాలోని ఇల్లినాయిస్‌ రాష్ట్రం డెక్లాబ్‌ సీటీలోని ఇల్లినాయిస్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చేస్తున్నారు. శనివారం స్నేహితుడి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు కారులో వెళ్లాడు. అక్కడ వేడుకలు ముగించుకుని తన కారులో భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో యూనివర్సిటీకి బయలే దేరాడు.

ఈ నేపథ్యంలో యూనివర్సిటీ సమీపంలో వెనుకవైపు వస్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో సాయికుమార్‌ అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా ప్రమాదాంలో ప్రాణాలు కోల్పోవడం గుండెలు బాదుకున్నారు. ఇరుగుపొరుగువారు వచ్చి ఎంత ఓదార్చిన ఫలితం లేకపోయింది.

అమెరికాలో ఉన్న తమ బంధువులకు విషయాన్ని తెలియ జేశారని చెప్పారు. కాగా, సాయికుమార్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చే విషయమై ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే సమాచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలియజేశారు. ఈ మేరకు ఢిల్లీలో అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A telugu student died a road accident occurred in America on Saturday.
Please Wait while comments are loading...