ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి, మద్యం మత్తులో డ్రైవర్
అన్నమయ్య: జిల్లాలోని మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వస్తున్న కారు.. నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో కారులోని ముగ్గురు మృతి చెందారు. మృతులను విక్రమ్, శ్రీను, తిలక్‌గా గుర్తించారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని మదనపల్లె ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, యువకులు మద్యం తాగి కారు డ్రైవింగ్ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదంలో తమ గ్రామానికి చెందిన పాడి రైతులు చంద్ర (50) , సుబ్రహ్మణ్యం (62) మృతి చెందారని చెప్పారు. వారి కుటుంబాలకు న్యాయం చేయాలని బార్లపల్లెలో స్థానికులు నిరసన చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న డీఎస్పీ ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బీహార్‌లో ఘోర ప్రమాదం: 9 మంది మృతి
బీహార్ రాష్ట్రంలోని కైమూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన 9 మంది మరణించారు. మోహానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి (NH-2)లో ఉన్న దేవకాలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ టీం సాయంతో మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గర్లోని భబువా సదర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications