రోజా రీ ఎంట్రీ అదుర్స్.. అత్త పాత్రలో అదరహో.. బుల్లితెర స్క్రీన్లు బద్దలే
ఫైర్ బ్రాండ్ రోజా.. తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. అటు హీరోయిన్ గా ఆమె చేయని సినిమాలు లేవు. దాదాపు అందరు అగ్రహీరోలతోనూ నటించి మెప్పించారు. నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో తల పండిన నాయకుల మధ్య తనదైన శైలిలో దూసుకెళ్లారు. మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పవర్ లో ఉన్నా లేకున్నా తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు రోజా. ఇప్పుడు ఆమె ఏం చేసినా సంచలనమే.
ఆర్కే రోజా.. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలిగారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మెరిశారు. జబర్దస్త్ టీవీ షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్ల పాటు షోలో సందడి చేశారు. ఆ షో సూపర్ హిట్ అయింది. అయితే ఆమె వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీవీ షోలకు దూరంగా ఉంటూవచ్చారు. తాజాగా ఆమె మరోసారి బుల్లితెరపై సందడి చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.

జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో కొత్త సీజన్ మొదలు అయింది. ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఈ షోకు యాంకర్ గా ఉండగా .. రోజా, డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో రోజా ఓ పాపతో కలిసి స్కిట్ చేశారు. అత్త పాత్రలో నవ్వులు పూయించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ శనివారం ఏప్రిల్ 12 రాత్రి 9 గంటలకు జీ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఐదు పదుల వయసులోను రోజాలో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. రోజా స్మైల్‌కు ఇప్పటికీ ఓ ఫ్యాన్ బేస్ ఉంది.
ఇదిలా ఉంటే రోజా రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైంది. 2004, 2009లో తెలుగుదేశం తరఫు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.YSR మృతి తర్వాత YSRCPలో చేరారు. ఆ తర్వాత 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు నగరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. ఎంతో మంది పేరుగాంచిన బడానేతలు వైసీపీని జగన్‌ను వీడి పక్క పార్టీ కండువా కప్పుకున్నా... రోజా మాత్రం తన చివరి శ్వాస వరకు జగన్‌తోనే తన రాజకీయ ప్రయాణం అని వెల్లడించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంటారు. పదవిలో ఉన్నా లేకున్న తన నియోజకవర్గం నగరి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలను అందజేస్తు చాలా యాక్టివ్‌గా కనిపిస్తారు.
పాలిటిక్స్‌లో బిజీగా ఉన్న రోజా... వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మంచి పాత్రలు వస్తే తాను నటించేందుకు సిద్ధమని గతంలో పలు ఇంటర్వ్యూలో రోజా చెప్పుకొచ్చారు. మరి బుల్లి తెరపై రీఎంట్రీ ఇచ్చిన ఈ ఫైర్ బ్రాండ్ తిరిగి వెండితెరపై కూడా కనిపిస్తారనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications