జగన్ తో రోజా రాఖీ వేడుకలు.. పవన్ కళ్యాణ్ పాట హైలెట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పర్యాటక శాఖ మంత్రిగా ఎప్పుడూ వార్తల్లో నిలిచిన రోజా, ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ,పవన్ కళ్యాణ్ పైన తీవ్ర వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయిన రోజా తాజాగా పెట్టిన ఒక సంచలన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
రాఖీ కట్టి పండుగ చేసుకుంటున్న ప్రజలు
రాష్ట్రవ్యాప్తంగా సోదర సోదరీమణుల మధ్య బంధానికి ప్రతీకగా అన్నకు రక్షగా, చెల్లి చెల్లెలికి అండగా ఉంటామని చెప్పడానికి సూచనగా రక్షాబంధనాన్ని కట్టి ప్రతి ఒక్కరూ తోడబుట్టిన వారు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటారు.

పవన్ పాటతో జగన్ పై రోజా పోస్ట్
రాఖీ పండుగ సందర్భంగా గతంలో ఏపీ సీఎంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి కి రాఖీ కట్టి సంబరాలు జరుపుకున్న రోజా ఈసారి సోషల్ మీడియాలో పోస్ట్ తో సరిపెట్టుకున్నారు. అయితే ఆ పోస్ట్ ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించేలా చేసింది. ఇంతకీ రోజా పెట్టిన పోస్ట్ ఏమిటి అంటే ..
ప్రపంచంలోనే గొప్ప సోదరుడు జగన్ :రోజా పోస్ట్
ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో తనకు ఉన్న సోదరీ బంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచంలోనే గొప్ప సోదరుడు జగన్మోహన్ రెడ్డి అని రాఖీ కట్టిన ఫోటోలను, జగన్ తో తాను నాడు సంతోషంగా దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. రక్షాబంధన్ సాక్షిగా ఎప్పుడూ తనకు అండగా ఉంటున్నందుకు ధన్యవాదాలు అంటూ రోజా పోస్ట్ పెట్టారు.
జగన్ రోజాల ఫోటోలకు పవన్ పాట
ఇక ఈ పోస్టుతో అన్నయ్య అన్నావంటే ఎదురవనా అనే పవన్ కళ్యాణ్ పాటను యాడ్ చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమాలోని ఈ పాటకు జగన్మోహన్ రెడ్డి రోజా ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను పెట్టి రాఖీ రోజు జగన్ పైన తన అభిమానాన్ని చాటుకున్నారు. అయితే రోజా పెట్టిన పోస్ట్ లో జగన్ రోజాల అనుబంధం కంటే పవన్ కళ్యాణ్ పాట పైనే ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు.
రోజాపై జనసైనికుల సెటైర్లు
పొద్దున లేస్తే పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన రోజా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా పాటతో వీడియోను పోస్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ పాట పవన్ కళ్యాణ్ పాటే అని తెలిసే పెట్టారా.. తెలియక పెట్టారా అని సెటైర్ లు వేస్తున్నారు జనసైనికులు. మీ అన్నా చెల్లెళ్ళ బంధానికి పవన్ పాట ఎందుకమ్మా అని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications