అమరావతి ఇన్విటేషన్‌లో మ్యాప్, నాలుగు గ్రూప్‌లుగా పాస్‌లు: అమరావతికి కలశాలు
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రికలు అతిథులకు మార్గ సూచికలుగా రూపొందించారు. సోమవారం నాటికి 4.08 లక్షల ఆహ్వాన పత్రికల పంపిణీ జరిగింది. వీటిని నాలుగు తరగతులుగా విభజించారు.
రైతులు, సామాన్యులకు ఆహ్వాన పత్రికలు అందాయి. ఇతర రంగాలకు చెందిన వారిని ఏఏఏ - ఎంఐపీలు, ఏఏ - వీవీఐపీలు, ఏ -వీఐపీలుగా గుర్తించింది. వీరికి ఎరుపు, నీలం రంగులతో కూడిన వాహనాల పాస్, సభా ప్రాంగణంలోకి ప్రవేశానికి పాస్, రూట్ మ్యాప్‌లను ఆహ్వాన పత్రికలో అందించింది.
ప్రదాని నరేంద్ర మోడీ నుంచి ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర, రాష్ట్రాలలకు చెందిన వారిని ఒక తరగతిగా పరిగణించింది. ప్రభుత్వంతో సంబంధం ఉన్న వారందరినీ మూడు తరగతులుగా విభజించింది. ఏఏఏ, ఏఏ, ఏ తరగతి పాస్‌లు ఇచ్చింది.
ఇతర రంగాలకు చెందిన వారిని మూడు తరగతులుగా... ఏఏఏ, ఏఏ, ఏగా విభజించి నీలం రంగు పాస్‌లు అందించింది. మూడు తరగతులకు చెందిన ఆహ్వాన పత్రికలకు క్యూ ఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ నెంబర్ ఉంది. హోలోగ్రాంను స్కాన్ చేయగానే అది ప్రభుత్వం జారీ చేసిన ఆహ్వాన పత్రికా, నకిలిదా తేలుతుంది. వెహికిల్ పాస్, వేదిక పాస్ సరైనదా, కాదా తెలిసిపోతుంది.

మన నీరు మన మట్టికి స్పందన
అమరావతి నిర్మాణానికి 22న శంకుస్థాపన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరినీ భాగస్వాములు చేయాలనే తలంపుతో సిఎం చంద్రబాబు ఇచ్చిన మన నీరు -మన మట్టి పిలుపుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచీ అనూహ్య స్పందన లభించింది. విదేశాల నుంచి కలశాలు వచ్చాయి.
రాష్ట్రంలోని 150 శాసనసభా నియోజకవర్గాల నుంచి కలశాలతో కూడిన 150 భారీ వాహనాలు ఒకదానివెంట ఒకటిగా మంగళవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని చంద్రబాబు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రదేశానికి చేరుకుంటాయి.
టిడిపి ఎంపీలు, 19 రాష్ట్రాల నుంచి సేకరించిన కలశాలు 19 వాహనాల్లో సోమవారం రాత్రి విజయవాడ నగరానికి చేరుకున్నాయి. వీటిని స్వరాజ్య మైదాన్‌లో చంద్రబాబు పరిశీలించారు. వాహనాలన్నీ మంగళవారం నేరుగా అమరావతికి బయల్దేరనున్నాయి.
కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి జెండా ఊపి వాహనాలను తరలిస్తారు. విజయవాడ ఎంపి కేశినేని నాని ఆధ్వర్యంలో భారీఎత్తున వాహన ర్యాలీ జరుగబోతోంది. రాష్ట్రంలోని 16వేల గ్రామాలు, వార్డుల నుంచి సేకరించిన పవిత్రమైన మట్టి, నీరుకు మూడురోజులు ఆయా ప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలతో పూజించారు.
-
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications