చిరంజీవి - పవన్ తరువాత, చెర్రీ మనసులో మాట : తారక్ ఫ్యామిలీతో 35 ఏళ్ల పోటీ...!!

రాంచరణ్ నాన్న..బాబాయ్ పైన ఎంత ప్రేమో చాటుకున్నారు. తారక్ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన మనసులో మాటను బయట పెట్టారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న వేళ రాం చరణ్ తో సహా ఆర్ఆర్ఆర్ టీం సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. ఢిల్లీలో అడుగు పెట్టిన రాం చరణ్ తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ హోం మంత్రి అమిత్ షాను కలిసారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ 2023 సెషన్‌లో పాల్గొన్నారు.

ఆ వేదికపై ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా, ఆస్కార్‌ తదితర అంశాలతోపాటు ఆసక్తికర విషయాలు చెప్పారు. నాన్న..బాబాయ్ పైన ఎంత ప్రేమో చాటుకున్నారు. ఆ తరువాత గౌరవించే స్థానం ఎవరిదో వెల్లడించారు. తారక్ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు.

రాజమౌళి స్వీట్ టార్చర్ పెట్టారు

ఆర్ఆర్ఆర్ హీరో రాంచరణ్ ఢిల్లీ వేదికగా ఆసక్తి కర అంశాలపైన స్పందించారు. నాన్న..బాబాయ్ పవన్ తరువాత తాను ఎక్కువగా గౌరవించే వ్యక్తి ఒక్కరేనని..ఆయనే రాజమౌళి అని చెర్రీ చెప్పారు. తనకు నాన్న ఎడమ కన్ను అయితే..బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ కుడి కన్నుతో సమానం. ఇద్దరు నాకు వేర్వేరు కాదని రాంచరణ్ చెప్పుకొచ్చారు.

ఆర్ఆర్ఆర్ కధ అనుకున్న సమయంలో తారక్ తో పాటుగా తనను ఎంపిక చేయటం వెనుక తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావటం వెనుక జక్కన్న చేసిన మ్యాజిక్‌. హీరోలుగా చేసిన తమ ఇద్దరికీ అయితే డైరెక్టర్‌ రాజమౌళి స్వీట్‌ టార్చర్‌ చూపించారని చెప్పుకొచ్చారు.

తారక్ ఫ్యామిలీలో 35 ఏళ్ల పోటీ ఉన్నా

తారక్ ఫ్యామిలీలో 35 ఏళ్ల పోటీ ఉన్నా

ఇదే సమయంలో నందమూరి కుటుంబంతో సినిమా పరంగా ఉన్న పోటీ గురించి ప్రస్తావించారు. తారక్‌ ఫ్యామిలీతో తమ కుటుంబానికి సినిమాల పరంగా, ఫ్యాన్‌ పరంగా 35 ఏళ్ళుగా పోటీ నడుస్తోందన్నారు. కానీ తమ ఇద్దరి మధ్య వ్యక్తిగతంగానూ..తమ కుటుంబాల మధ్య అలాంటిది ఏమీ లేదని వెల్లడించారు. రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు అయితే ఈ కాంబినేషన్‌ సెట్‌ అయ్యేది కాదని వ్యాఖ్యానించారు.

రాజమౌళి కావటంతోనే తమ కెరీర్‌ను ఆయన మీద పెట్టేశామన్నారు. ఆయనంటే అంత నమ్మకమని చెప్పారు. వర్క్‌లో ఆయన మిస్టర్‌ పర్ఫెక్ట్‌ అని రాంచరణ్ ప్రశంసించారు. 'నాటునాటు' పాట అంతగా పాపులర్‌ అయింది అంటే దీని వెనుక ఎంతోమంది కష్టం ఉందన్నారు.

కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉంది

ఇదే వేదిక నుంచి రాంచరణ్ కు రాపిడ్ ఫైర్ ప్రశ్నలు..సమాధానలు ఆసక్తి కరంగా సాగాయి. రాం చరణ్ కు ఇష్టమైన కోస్టార్ అంటూ కియారా అడ్వాణీ గా సమాధానం ఇచ్చారు. చిరంజీవి - పవన్ కల్యాణ్ తో తన అనుబంధం ఏంటని ప్రశ్నిస్తే...రెండు కళ్లుగా రాం చరణ్ చెప్పిన సమాధానంతో ఆడిటోరియం మార్మోగింది.

ఎలాంటి పాత్ర చేయాలని ఉందనే ప్రశ్నకు క్రీడలతో నేపథ్యమున్న కధ చేయాలనేది తన కోరికగా చెప్పారు. విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తే నటించాలని ఉందని తన మనసులో మాట చెప్పారు. తన ఫేవరెట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌ గా రాజాస్థాన్‌ - స్విట్జర్లాండ్ అని రాం చరణ్ సమాధానం ఇచ్చారు. ఇక.. నాటు నాట పాటకు ఆస్కార్ తరువాత హైదరాబాద్ వచ్చిన రాంచరణ్ కు ఫ్యాన్స్ గ్రాండ్ గా స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+