సీఎం జగన్ కు బైరెడ్డి విషెస్ నెక్స్ట్ లెవల్ - సాగర గర్భం నుంచి : 30 అడుగుల లోతులో స్కూబా డైవ్‌..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. ఇప్పటికే పార్టీ సీఎం జన్మదినం నాడు ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇక, ప్రభుత్వ పరంగా సీఎం జగన్ తన మానస పుత్రిక అయిన సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించనున్నారు. ఇక, పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రకటనలు..హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక, కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యువ నేత.. శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్దరెడ్డి ఈ సారి డిఫరెంట్ గా సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు.

సముద్రగర్భం నుంచి గ్రీటింగ్స్

సముద్రగర్భం నుంచి గ్రీటింగ్స్

ఈనెల 21న సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా సముద్ర గర్భంలోకి వెళ్లి అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌ డే సీఎం సార్‌ ..అని రాసి ఉన్న విషెస్ కార్డును ప్రదర్శించి..ఫొటోలు దిగారు. తక్కువ కాలంలోనే కర్నూలు జిల్లా వైసీపీకి క్రియా శీలకంగా ఎదిగిన బైరెడ్డి..ఇప్పుడు సీఎంకు నెక్స్ట్ లెవల్ విషెస్ చెప్పటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్నూలు జిల్లా నందికొట్కూరులో వైసీపీకి బైరెడ్డికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో నందికొట్కూరులో వైసీపీ గెలుపు కోసం పని చేసారు. జగన్ తన నందికొట్కూరు ప్రచార సభలో బైరెడ్డికి సంబంధించి కీలక హామీ ఇచ్చారు.

తన మనసులో బైరెడ్డి ఉన్నారంటూ

తన మనసులో బైరెడ్డి ఉన్నారంటూ

బైరెడ్డి తన మనసులో ఉన్నాడని.. ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా కొద్ది నెలల క్రితం జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో బైరెడ్డికి సీఎం జగన్ శాప్ ఛైర్మన్ గా పదవి కట్టబెట్టారు. ఇక, నియోజకర్గంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యేతో విభేదాలు ఉన్నాయి. బైరెడ్డి తనకు సీఎంతో ఉన్న సంబంధాల కారణంగా పార్టీలో ఎవరినీ లెక్క చేయరనే విమర్శలూ ఉన్నాయి. ఎమ్మెల్యేతో ఉన్న విభేదాలను జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అనిల్ పరిష్కరించే ప్రయత్నాలు పలు సందర్బాల్లో చేసారు. ఇక, పార్టీలోని ముఖ్య నేతలతోనూ బైరెడ్డి సత్సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు.

30 అడుగుల లోతు వరకు స్కూబా డైవ్‌

30 అడుగుల లోతు వరకు స్కూబా డైవ్‌

తాజాగా, ఆయన రాష్ట్రంలో క్రీడల ప్రోత్సహం పైన ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా 110 జలక్రీడ ప్రాంతాలను గుర్తించినట్టు వెల్లడించారు. విశాఖ రుషికొండలోని యాటింగ్‌ సెంటర్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నదులు, సముద్రంలో 110 ప్రాంతాలు జల క్రీడలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అనంతరం ఆయన లైవ్‌ అడ్వంచర్‌ డైరెక్టర్‌ బలరామ్‌నాయుడుతో కలసి సముద్రంలో 30 అడుగుల లోతు వరకు స్కూబా డైవ్‌ చేశారు.

సముద్ర గర్బం నుంచి విషెస్..నెక్స్ట్ లెవల్

సముద్ర గర్బం నుంచి విషెస్..నెక్స్ట్ లెవల్

ఈనెల 21న సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా సముద్ర గర్భంలోకి వెళ్లి అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌ డే సీఎం సార్‌ అంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాను ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు జగనన్నతోనే అంటూ క్యాప్షన్ తో బైరెడ్డి చేసిన పోస్టింగ్ ఇప్పుడు వైసీపీ గ్రూపుల్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే హ్యాపీ బర్త్ డే జగనన్న హ్యాష్ ట్యాగ్ తో క్యాంపెయిన్ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+