జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా స్టార్ హీరో
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా (NTR30) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను చిత్రబృందం సోషల్‌మీడియాలో పంచుకుంది. సర్‌ప్రైజ్ అప్‌డేట్‌తో #NTR30 హ్యాష్ ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.
ఈ హైవోల్టేజ్ యాక్షన్ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీఖాన్ నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా అదే విషయాన్ని ధ్రువీకరిస్తూ మూవీ టీం ఫొటోలు విడుదల చేసింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన సైఫ్ అలీఖాన్ NTR30 సెట్స్ లో అడుగుపెట్టిన విషయాన్ని తెలిపింది. రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం జాన్వీకపూర్ కూడా హైదరాబాద్‌లో లాండ్ అయింది. ఎన్టీఆర్ మాస్‌లుక్ పోస్టర్, జాన్వీ కపూర్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ఈ సినిమాపై హైప్ ను చిత్రబృందం పెంచేసింది. పాన్ ఇండియా స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించనున్నాడని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్‌ని సంగీత దర్శకుడిగా ఖరారు చేశారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్నారు. సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ లో రావణుడి పాత్రలో కనిపించబోతున్నారు.












Click it and Unblock the Notifications