వైసీపీలో ఎందుకీ టెన్షన్ - ఏం జరుగుతోంది..!!

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపు పైన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. లోలోపల మాత్రం టెన్షన్ కొనసాగుతోంది. సీఎం జగన్ తాము తిరిగి అధికారంలోకి వస్తామని..2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. చంద్రబాబు అదే నమ్మకంతో ఉన్నారు. ఈ సమయంలోనే వైసీపీలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం నిర్ణయాలను తప్పు బడుతున్న వైసీపీ..తాజాగా కౌంటింగ్ ఏజెంట్లను అలర్ట్ చేసింది.

వైసీపీ అలర్ట్
పోలింగ్ రోజున చోటు చేసుకున్న హింస పైన వైసీపీ తీవ్రంగా స్పందించింది. కూటమి నేతల ఒత్తిడి మేరకు ఎన్నికల సంఘం పని చేస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఒక వైపు జగన్ తాము 151 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెబుతూనే..ఎన్నికల సంఘం, పోలీసు అధికారుల పైన వైసీపీ ఆరోపణలు చేయటంతో కొత్త సందేహాలు మొదలవుతున్నాయి. వైసీపీ ఓటమికి ముందస్తు కారణాల్లో భాగంగా ఈ ఆరోపణలు చేస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజాగా..పోలింగ్ ఏజెంట్లకు సజ్జల చేసిన సూచనలు ఆసక్తి కరంగా కనిపిస్తున్నాయి.

Sajjal alerts party agents for Counting issues latest guide lines

సజ్జల సూచనలు
ఎన్నికల కౌంటింగ్ సంద‌ర్భంగా అంద‌రూ అల‌ర్ట్‌గా ఉండాల‌ని వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూచించారు. కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధానాలపై ఇవాళ జూమ్ లో కౌంటింగ్ 175 నియోజక వర్గాల కౌంటింగ్ ఏజెంట్లు, పార్టీ నేతలకు సజ్జల దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారన్నారు. ఈసీ, ఎన్డీయే కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ప్రజా తీర్పు వైయ‌స్ఆర్‌సీపీకి అనుకుూలంగా ఉందన్నారు.

Sajjal alerts party agents for Counting issues latest guide lines

అప్రమత్తంగా చూడాలి
పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారు జాగ్రత్తగా చూడాలి అని సూచించారు. వైయ‌స్ఆర్‌సీపీకి పడిన ప్రతి ఒక్క ఓటు మన పార్టీకే చెందాలి.. చెల్లని ఓటు చెల్లదని గట్టిగా చెప్పాలి అని పేర్కొన్నారు. ప్రత్యర్ధి పార్టీలు నిబంధలను అతిక్రమిస్తే గట్టిగ నిలదీయాలన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నియమాలను ఫాలో అవ్వాలి అని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. అవసరం అయితే అవతల వాళ్ళని క్వశ్చన్ చేసి ఫిర్యాదు చేయాడానికి అయినా సిద్ధంగా ఉండాల‌ని సూచించారు. అన్ని అంశాలపై పూర్తి అవగాహనతో కౌంటింగ్ ఏజెంట్లు ఉండాలి.. తెలియని విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలని నిర్దేశించారు. ఇప్పటి వరకు ఎంత సీరియస్ గా ఉన్నామో.. కౌంటింగ్ రోజు అంత కన్నా సీరియస్ గా.. అలర్ట్ గా ఉండాలిని సజ్జల స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+