పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటన వీడియో ఒక్కటే లీకైందా? ఈసీకి సజ్జల సూటిప్రశ్నలు!!

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ఏపీ రాజకీయాలలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ ఘటనపై తాజాగా స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. అంతేకాదు ఎన్నికల సంఘం తీరుపైన కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

పిన్నెల్లి వీడియోపై సజ్జల అనుమానాలు.. ఈసీకి ప్రశ్నలు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్ లను ధ్వంసం చేశారని లీక్ చేసిన వీడియో నిజమైన వీడియోనే అని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా అంటూ ప్రశ్నించారు. అసలు వీడియో సరైనదా కాదా అని నిర్ధారించుకోకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుందని ఆయన ప్రశ్నించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసం చేసిన వీడియో నిజమైన వీడియోనే అయితే అది సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.

Sajjala ramakrishna reddy Straight questions to EC Only Pinnelli EVM vandalism video leaked

మాచర్లలో జరిగిన అన్ని ఘటనల వీడియోలు బయటపెట్టండి
పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గం లో ఏడు ఘటనలు జరిగాయని చెబుతున్న ఈసీ కేవలం ఒక్క వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ కు చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
అసలు అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే ఏం జరిగిందో తెలుస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈసీ సరైన నిర్ణయాలు ఎందుకు తీసుకోవటం లేదు
కేవలం ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రమే బయటకు తీసుకువచ్చి చేస్తున్న రచ్చ పై ఈసీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి, వారిని గుర్తించడానికి ఈసీ ఎందుకు సరైన విధానంలో నిర్ణయాలు తీసుకోవడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

https://twitter.com/SRKRSajjala/status/1793530975210836019

టీడీపీ దాడుల వీడియోలు పోస్ట్ చేసి షాకింగ్ ప్రశ్నలు
ఇక టీడీపీ దాడుల వీడియోలను పోస్ట్ చేసిన సజ్జల ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మరో రెండు వీడియోలను పరిశీలిస్తే, అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని, వారి మీద ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. దాడుల వెనుక ఉన్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల కమిషన్ కు సూటి ప్రశ్నలు సంధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+