ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే కాకుండా ఆయన అభిమానులు కూడా భారీగా అంచనాలు పెట్టుకున్న సినిమా సలార్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి హ్యట్రిక్ డిజాస్టర్ల తర్వాత డార్లింగ్ నుంచి రాబోతున్న చిత్రం ఇది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ దీన్ని నిర్మించింది. ఈ క్రేజీ మూవీని ఐమ్యాక్స్ ఫార్మాట్ లోను విడుదల చేయబోతున్నారు.
అలా విడుదల చేయబోతున్నట్లు అమెరికా డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా ధ్రువీకరించారు. త్వరలోనే ఈ వెర్షన్ లో చూసేందుకు టికెట్లు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇండియాలో కూడా ఐమ్యాక్స్ వెర్షన్ విడుదలవుతుందా? లేదంటే మాములుగానే విడుదల చేస్తారా? అనేది ఇంకా స్పష్టత రాలేదు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకున్నప్పటికీ ప్రభాస్ ను సరిగా చూపించకపోవడంతో ఆయన అభిమానులు నిరాశ పడ్డారు. మరో రెండువారాల్లో సినిమా ట్రైలర్ ను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. టీజర్ లాగే ట్రైలర్ లో ఎలివేషన్స్ చూపించబోతున్నారు. సినిమా కథ తెలియనివ్వకుండా ఉండేందుకు యూనిట్ ఈ మార్గాన్ని ఎంచుకుంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు, జగపతి బాబులాంటి సీనియర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు.
కేజీఎఫ్ రెండు భాగాలు చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్ ను చూడటానికి అలవాటు పడ్డ అభిమానులు సలార్ ను ఐమ్యాక్స్ ఫార్మాట్ లో చూడటానికి కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక రన్ టైం ఉండబోతోంది. ఆదిపురుష్ 2 గంటల 59 నిముషాల నిడివి ఉండగా అంతకంటే ఒక నిముషం ఎక్కువగా సలార్ రాబోతోంది. జాలి, దయ, కనికరం ఏ మాత్రం లేని కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా ప్రభాస్ సలార్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications