Samantha: పబ్‌లో ఊ అంటావా.. ఊఊ అంటావా మావా.. వరుణ్ ధావన్‌తో సమంత!!
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సమంత అటు సినిమాలతోనే కాకుండా, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్, డీకే దర్శకత్వంలో సిటాడెల్ లో సమంత నటిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సమంత సిటాడెల్ కోసం విదేశాలలో ఉన్నారు. ప్రస్తుతం సెర్బియాలో హంగామా చేస్తున్నారు.
మొన్నటికి మొన్న సెర్బియాలో రాష్ట్రపతిని కలిసిన సిటాడెల్ టీం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేశారు. సెర్బియా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసిన సమంత తో పాటు, సిటాడెల్ టీం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ సెర్బియాలో జరుగుతుంది. సిటాడెల్ కోసం సమంత ట్రాన్స్ఫర్మేషన్ పైన కూడా సినీ వర్గాలలో ఆసక్తికర చర్చ జరిగింది.

ఇలా ఉంటే తాజాగా సిటాడెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు సమంత రుత్ ప్రభు. షూటింగ్ నుంచి కాస్త రిలాక్స్ పొందడం కోసం సిటాడెల్ యూనిట్ సెర్బియా బెల్గ్రేడ్ లోని ఓ పబ్ కి వెళ్ళింది. అక్కడ పబ్ లో సమంత సందడి చేశారు. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అంటూ పాటను ప్లే చేయడంతో సమంత అక్కడే ఉన్న సహనటుడు వరుణ్ ధావన్ తో కలిసి స్టెప్పులేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. పుష్ప సినిమాలోని ఈ పాట అనేక భాషల్లో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాకే హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఒక్క పాటలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన సమంత సినిమాను ఓ రేంజ్ కు తీసుకు వెళ్లారు అంటే అతిశయోక్తి కాదు.
పబ్‌లో ఊ అంటావా.. ఊఊ అంటావా మావా.. వరుణ్ ధావన్‌తో సమంత!! #Samantha #VarunDhawan #Pub #Dace #ViralVideo #Citadel #Oneindiatelugu pic.twitter.com/1x2JRFvr58
— oneindiatelugu (@oneindiatelugu) June 10, 2023
ఇక అటువంటి పాటతో ఊగిపోయిన సమంత వీడియో లో చాలా ఉత్సాహంగా కనిపించారు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సమంతకు ఉండే క్రేజ్ అలాంటిది అని చర్చిస్తున్నారు. సినిమాలైనా, వెబ్ సీరీస్ అయినా ప్రాణం పెట్టి నటిస్తుందని అంటున్నారు ఆమె అభిమానులు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications