ఏపీ, తెలంగాణాల్లో నేడు రద్దయిన రైళ్ల వివరాలివీ..

Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరింత పెరుగుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తుతోంది. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీ తీవ్రంగా పడింది.

ఎక్కడికక్కడ..

భారీ వర్షాలు, వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై తీవ్ర పడింది. వల్ల పలు చోట్ల రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. అనేక చోట్ల పట్టాల కింద మట్టి కోతకు గురైంది. కొన్నిచోట్ల పట్టాలపై వరదనీరు ప్రవహిస్తోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇప్పటికే పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.

SCR cancelled and diverted these trains due to heavy rains in AP and Telangana

నేడు కూడా..

నేడు కూడా పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్ని పాక్షికంగా రద్దయ్యాయి. మరి కొన్నింటిని దారి మళ్లించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వాటి వివరాలతో కూడిన ప్రెస్ నోట్‌ను కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు.

రద్దయిన రైళ్లు..

నంబర్ 07753 ఖాజీపేట్- డోర్నకల్, నంబర్ 07755 డోర్నకల్- విజయవాడ, నంబర్ 07464 విజయవాడ- గుంటూరు, 07465 గుంటూరు- విజయవాడ, 07756 విజయవాడ- డోర్నకల్, నంబర్ 07754 డోర్నకల్- ఖాజీపేట్ రైళ్లు రద్దయ్యాయి.

పాక్షికంగా రద్దయినవి..

17033 భద్రాచలం రోడ్- సిర్పూర్ టౌన్, 17034 సిర్పూర్ టౌన్- భద్రాచలం రోడ్ రైలు పాక్షికంగా రద్దయింది. 5వ తేదీ వరకు ఈ రైలు భద్రాచలం రోడ్- ఖాజీపేట్ మధ్య అందుబాటులో ఉండదు. సిర్పూర్ టౌన్ నుంచి ఖాజీపేట్ మధ్యే రాకపోకలు సాగిస్తుంది.

దారి మళ్లించినవి..

దానాపూర్- ఎస్ఎంవీటీ బెంగళూరు రైలును ఖాజీపేట్, సికింద్రాబాద్, సూలేహళ్లి, గుంతకల్, ధర్మవరం మీదుగా మళ్లించారు. అహ్మదాబాద్- చెన్నై సెంట్రల్ రైలు సూరత్, జల్గావ్, మన్మాడ్, ధౌండ్, వాడి, గుంతకల్, రేణిగుంట మీదుగా, యశ్వంత్‌పూర్- తుగ్లకాబాద్ రైలును ధర్మవరం, గుంతకల్, వాడి, దౌండ్, మన్మాడ్, ఇటార్సీ మీదుగా, పటేల్ నగర్- రాయపురం రైలును ఖాజీపేట్, సికింద్రాబాద్, సూలేహళ్లి, గుంతకల్, రేణిగుంట మీదుగా మళ్లించారు.

విజయవాడ మీదుగా..

చెన్నై సెంట్రల్- హౌరా, కడప- విశాఖపట్నం, రామేశ్వరం- భువనేశ్వర్, అలప్పుజ- ధన్‌బాద్, తిరుపతి- కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్‌లను విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా మళ్లించారు. విజయవాడ, నిడదవోలు మధ్య ఏ స్టేషన్‌లో కూడా ఆయా రైళ్లకు స్టాపేజీ ఉండదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+