వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మేనమామ రవీంద్రనాథ్ కంపెనీలో తనిఖీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

దామరచర: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి మేనమామ, కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి చెందిన హరిత ఫర్టిలైజర్స్‌ కంపెనీలో సోమవారం వ్యవసాయ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. కర్మాగారంలో అక్ర మ నిల్వలతోపాటు నాణ్య తపై ఫిర్యాదులు అంద డంతో అధికారులు తనిఖీలు చేపట్టి ఎరువుల నమూనాలను సేకరించి, రికార్డులను పరిశీలించారు.

ముడి సరుకులుగా యూరియా, డీఏపీ, పొటాష్‌, చైనా క్లే, డోలమైట్‌లను ఉపయోగించి 14-35-14, 17-17-17, 19-19-19, 20-20-0, 22-0-11 తదితర ఎరువులను ఉత్పత్తి చేస్తున్నారు. పరిశ్రమకు ముడి సరుకుగా యూరియా ఎక్కువ మోతాదులో కావాల్సి ఉంది. గతంలో రైతులకు సబ్సిడీ యూరియా దొరకని పరిస్థితుల్లో సైతం ఇక్కడ యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి.

Searches made in Ravindranath reddy's company

దీనిపై పరిశ్రమకు, అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బండారు దత్తాత్రేయతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు హరిత ఫెర్టిలైజర్స్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. పరిశ్రమలో తయారయ్యే ఎరువుల నాణ్యత విషయంలోనూ లోపాలున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎరువుల తయారీకి స్థానికంగా తయారయ్యే సున్నపు పొడిని మోతాదుకు మించి వినియోగిస్తున్నారని ఆరోపణలున్నాయి. హరిత ఫెర్టిలైజర్స్‌లో గతంలో జరిగిన హామీలన్నీ నామమాత్రమేనని, సున్నపుపొడి నిల్వలు అధికంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.

English summary
Agriculture officers made searches in Ravaindranath reddy's Haritha fertilisers company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X