పెండింగ్ కార్పోరేషన్లు, మున్సిపాల్టీలకు ఎన్నికల ముహూర్తం..!?
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ కీలక దశకు వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగా.. ఈ రోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇక.. పంచాయితీలకు నిర్వహించాల్సి ఉంది. అయితే, కోర్టు వ్యవహారాల కారణంగా ఎన్నికలు జరగని మూడు కార్పోరేషన్లు.. 20 వరకు ఉన్న మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. నోటిఫికేషన్ విడుదల పైనా చర్చలు జరుగుతున్నాయి. న్యాయ వివాదాలు లేకుండా ఎన్నికల నిర్వహణ దిశగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఫలితాలు వెల్లడి అయ్యాయి. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 7న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా, ఆ తరువాత మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 13 కార్పోరేషన్లు, 87 మున్సిపాల్టీలకు ఎన్నికలు.. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. న్యాయపరమైన వివాదాల కారణంగా 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ 23 స్థానాల్లో 4 కీలక మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, మిగిలిన 20 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలుగా ఉన్నాయి. ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వకపోవడంతో వీటికి కూడా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, మంగళగిరి వంటి అత్యంత కీలకమైన మూడు నగర పాలక సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణ దిశగా
ఈ కార్పోరేషన్లలో విలీన గ్రామాల విలీనం పై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. కోర్టుల పరిధిలో ఉన్న ఈ కీలక అంశాలపై నవంబర్ 17న సుప్రీం కోర్టులో తుది విచారణ ఉంది. పలు పిటీషన్ల విత్ డ్రా దిశగా కనిపిస్తున్నాయి. కాగా.. సుమారు 20 పట్టణ సంస్థల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న శ్రీకాళహస్తి, నెల్లూరు-తిరుపతి పరిధిలోని గూడూరు, అల్లూరు, ప్రకాశం పరిధిలోని కందుకూరు, పొదిలి, అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట వంటి మున్సిపాలిటీలు ఈ పెండింగ్ జాబితాలో ఉన్నాయి. వార్డుల సరిహద్దులు, విలీన పంచాయతీల అభ్యంతరాలే ఈ పట్టణాల్లో ఎన్నికల జాప్యానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఇప్పటికే మూడు కార్పోరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేసారు. దీంతో.. న్యాయ పరమైన చిక్కులు లేకుండా ఎన్నికల నిర్వహణ దిశా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.













Click it and Unblock the Notifications
