మళ్లీ నామినేషన్ల నిర్ణయంతో వైసీపీకి అదొక్కటే రిలీఫ్ - జగన్ బిగ్ డెసిషన్..!!

రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో తిరిగి నామినేషన్ల స్వీకరణకు నిర్ణయించింది. కలెక్టరేట్ల లోనూ నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పించింది. నవంబర్ 1వ తేదీకి పోలింగ్ వాయిదా వేసింది. అయితే, ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో వైసీపీకి ఆ ఒక్కటే రిలీఫ్ దక్కింది. తాము ప్రస్తావించిన అసలు అంశాల పైన ఎస్ఈసీ నిర్ణయం రాలేదని చెబుతున్నారు. దీంతో... మరోసారి న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో తమను అడ్డుకున్నారని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. 19 మున్సిపాల్టీల్లో తిరిగి నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని.. తమ అభ్యర్ధులకు భద్రత ఇవ్వాలని అభ్యర్ధించింది. దీంతో, సుప్రీం వైసీపీ ఫిర్యాదులను పరిశీలించి తిరిగి నామినేషన్లకు అవకాశం పైన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి సూచన చేసింది. ఈ మేరకు క్షేత్ర స్థాయి నివేదికల మేరకు ఎన్నికల సంఘం తమ నిర్ణయం ప్రకటించింది. కడప, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మైదుకూరు, రాజంపేట మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలుకు తిరిగి అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ నిర్ణయించింది. కడప లో 11 వార్డుల్లో, రాజంపేట మున్సిపాలి టీలోని 11 వార్డులలో..తిరుపతి కార్పోరేషన్ లో 18 వార్డుల్లో నామినేషన్ల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మైదుకూరు పైన సుప్రీం సూచనలకు ముందే ఎన్నికల సంఘం అక్కడ ఎన్నికలను వాయిదా వేసింది.

వైసీపీలో చేరిన గుండ లక్ష్మీదేవి - పదవి ఖరారు చేసిన జగన్..!!
వైసీపీలో చేరిన గుండ లక్ష్మీదేవి - పదవి ఖరారు చేసిన జగన్..!!
sec-reopens-nominations-in-several-areas-ysrcp-mulls-moving-supreme-court-again-details-here

మళ్లీ సుప్రీంకు వెళ్లే యోచనలో వైసీపీ..!

తాజా ఆదేశాల్లో మైదుకూరులో 32 వార్డుల్లో తిరిగి నామినేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది. అయితే, ఈ ఆదేశాల పైన వైసీపీ ముఖ్య నేతలు మాజీ సీఎం జగన్ సమీక్ష చేస్తున్నారు. ఎక్కడా 19 మున్సిపాల్టీల్లో ఛైర్మన్ ఎన్నికకు తిరిగి నామినేషన్ కు అవకాశం ఇవ్వని అంశం పైన ఆ పార్టీ నేతల్లో ప్రధానంగా చర్చ సాగుతోంది. పుంగనూరు, దర్శి ప్రస్తావన లేకపోవటం పైనా పార్టీ నేతలు చర్చిస్తున్నారు. దీంతో.. న్యాయ పరంగా తమ ముందు ఉన్న మార్గాలపైన న్యాయ నిపుణుల సూచనలు తీసుకుంటున్నారు. తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే దాఖలు చేసిన పిటీషన్ పైన ఈ నెల 27న సుప్రీంకోర్టు విచారణ చేయాలని నిర్ణయించింది. సుప్రీం తిరిగి నామినేషన్లకు అవకాశం పైన అధికారం ఎన్నికల సంఘానికే వదిలేసిన విషయాన్ని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. దీంతో... ఇప్పుడు ఎన్నికల సంఘం తాజా నిర్ణయం.. వైసీపీ మరోసారి న్యాయ పోరాటం తో ఈ మొత్తం వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+