వచ్చేసింది రెండో వర్షాకాలం.. తుఫానుల సీజన్ స్టార్ట్!

సరిగ్గా అక్టోబర్ మధ్యనాటికి భారతదేశంలో ఒక ప్రధాన వాతావరణ మార్పు చోటుచేసుకుంది. దేశమంతటా నాలుగు నెలల పాటు సుదీర్ఘంగా వర్షాలు కురిపించిన నైరుతి రుతుపవనాల ప్రయాణం అక్టోబర్ 15తో అధికారికంగా ముగిసింది. నైరుతి తిరోగమనం పూర్తికావడంతోనే, దక్షిణ భారతదేశాన్ని పలకరించేందుకు ఈశాన్య రుతుపవనాలు దూసుకొచ్చాయి. సాధారణంగా దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఎండలు, పొడి వాతావరణం మొదలవుతుంటే.. మన దక్షిణ భారతదేశంలో మాత్రం ఇదే అసలైన 'రెండో వర్షాకాలం' (ట్విన్ మాన్సూన్). వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 21 వరకు దక్షిణ ద్వీపకల్పంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది.

అసలేమిటీ ఈశాన్య రుతుపవనాలు?

నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లిపోయే క్రమంలో గాలుల దిశ ఈశాన్యానికి మళ్లుతుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో బంగాళాఖాతం మీదుగా వీచే ఈ ఈశాన్య గాలులు తగినంత తేమను సేకరించి దక్షిణ భారత తీరాలపై వర్షిస్తాయి. నైరుతి రుతుపవనాలు దేశమంతటా వర్షాలు ఇస్తే.. ఈశాన్య రుతుపవనాలు మాత్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాలకే పరిమితమవుతాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ద్రోణులు, అల్పపీడనాలు, వాయుగుండాలు వేగంగా రూపాంతరం చెంది తీర ప్రాంతాల్లో స్వల్ప వ్యవధిలోనే భారీ వర్షాలకు కారణమవుతాయి.

Second Monsoon Arrives in South India IMD Predicts Intense Rains and Thunderstorms Until October 21

రాయలసీమ, కోస్తాంధ్రకు జీవనాధారం

ఈశాన్య రుతుపవనాల సీజన్ మన కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న తమిళనాడుకు అత్యంత కీలకమైనది. తాగునీటి ప్రాజెక్టులు నిండటానికి, రబీ సీజన్ పంటల సాగుకు, భూగర్భ జలాలు పెరగడానికి ఈ మూడు నెలల వర్షపాతమే ప్రాణాధారం. తమిళనాడుతో పాటు ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాలకు ఈ కాలంలో పడే వానలే పంటలకు ప్రధాన నీటి వనరుగా నిలుస్తాయి.

ఇక జోరు వానలే: ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయ్
ఇక జోరు వానలే: ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయ్

కొనసాగుతున్న ద్రోణి.. నేడు ఎక్కడెక్కడ వర్షాలంటే?

ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం వరకు ఒక బలమైన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. శనివారం ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ వ్యాప్తంగా, అలాగే కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడవచ్చు.

ఏ క్షణమైనా భారీ వర్షం.. ఈశాన్య రుతుపవనాల ఆగమనం
ఏ క్షణమైనా భారీ వర్షం.. ఈశాన్య రుతుపవనాల ఆగమనం

నిన్నటి నుంచే మొదలైన వానల జోరు

శుక్రవారం సాయంత్రం నుంచే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తిరుపతి జిల్లా రేణిగుంటలో 85.7 మిల్లీమీటర్ల వర్షం పడగా, ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 81.9 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే అన్నమయ్య జిల్లా మదనపల్లె (59.5 మి.మీ), బాపట్ల జిల్లా ఇడుపులపాడు (57.9 మి.మీ), తూర్పుగోదావరి జిల్లా సీతానగరం (54.7 మి.మీ) ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది. చిత్తూరు, కడప, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పల్నాడు, నెల్లూరు, ఏలూరు (పోలవరం ప్రాంతం) జిల్లాల్లో సైతం పలుచోట్ల 35 నుంచి 46 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పొలాల్లో పనిచేసే రైతులు, ప్రజలు పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+