సీఎం సాక్షిగా అవమానం!: దేవినేనిని అడ్డుకున్న సెక్యూరిటీ
సీఎం సాక్షిగా నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఎం సాక్షిగా అవమానం ఎదురైంది.
విజయవాడ: ఏవోబీలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భద్రతను మరింత పెంచారు. ఎంతగా అంటే తెలియని వ్యక్తులు ఎవరూ కూడా భద్రతాదళాలను దాటుకుని చంద్రబాబు దగ్గరకు వెళ్లలేరు. ఈ క్రమంలోనే సీఎం సాక్షిగా నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఎం సాక్షిగా అవమానం ఎదురైంది.
వివరాల్లోకి వెళితే.. మంగళవారం విజయవాడలో టీడీపీ వర్క్‌షాప్ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశానికి హాజరైన మంత్రి దేవినేని... సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబుకు సెక్యూరిటీగా ఉన్న కమాండోలు ఆయన్ను అడ్డుకున్నారు.

కాగా, చంద్రబాబు అడుగు దూరంలో ఉన్నా కలవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మంత్రి దేవినేని కాస్త అసంతృప్తికి లోనయ్యారు. అయితే, చంద్రబాబుకు ఇటీవల ఏవోబీ ఎన్‌కౌంటర్ అనంతరం సెక్యూరిటీ పెంచారు. ఈ సెక్యూరిటీ సిబ్బంది తరుచుగా మారుతుంటారు.. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరన్న విషయం వారికి తెలియదు. ఈ క్రమంలోనే మంత్రి దేవినేని ఉమను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
సెక్యూరిటీ కమాండోలకు తెలుగు రాకపోవడం కూడా ఇందుకు ఓ కారణంగా తెలుస్తోంది. అయితే, స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని ఆయన మంత్రి అని చెప్పడంతో అప్పుడు చంద్రబాబు దగ్గరికి కమాండోలే దగ్గరుండి తీసుకెళ్లారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో












Click it and Unblock the Notifications