వృద్ధులకు ఎంత కష్టం: తెల్లవారుజాము నుంచే సచివాలయాల వద్ద క్యూ

AP Pensions: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- పింఛన్ల పంపిణీ వ్యవహారం ప్రచార అస్త్రంగా మారింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఇరుకున పెడుతోంది. దీనిపై ఆ పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌పైనా ఎదురుదాడికి దిగుతోంది.

రాష్ట్రంలో వలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. అసెంబ్లీ, లోక్‌సభ ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో వలంటీర్ల ద్వారా పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేయడం సరికాదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన విషయం తెలిసిందే.

Senior Citizens queuing up at of the Secretariats for Pensions in Andhra Pradesh

చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆప్తుడు అనే పేరుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు. తెలుగుదేశ పార్టీనే ఆయనతో ఈసీకి ఫిర్యాదు చేయించిందనే ప్రచారం రాష్ట్రంలో విస్తృతంగా సాగుతోంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పలు పిటీషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ఫిర్యాదుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు సానుకూలంగా స్పందించారు. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి పింఛన్ మొత్తాన్ని ఇవ్వడానికి బదులుగా సచివాలయం వద్ద ఆ మొత్తాన్ని పంపిణీ చేసే ఏర్పాట్లు తీసుకుంది.

దీనికి అనుగుణంగా ఇంకాస్సేపట్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ/వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ ఆరంభం కానుంది. తమ నివాసం పరిధిలోని సచివాలయానికి వెళ్లి వారంతా పింఛన్ మొత్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, నడవలేని వారికి ఇంటి వద్దే పింఛన్ మొత్తాన్ని అందేలా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో తెల్లవారు జాము నుంచే వయోవృద్ధులు గ్రామ/వార్డు సచివాలయాల వద్దకు చేరుకుంటోన్నారు. ఎండ తీవ్రత పెరగక ముందే పింఛన్ మొత్తాన్ని తీసుకుని ఇళ్లకు వెళ్లాలనే ఉద్దేశంతో ముందుగానే సచివాలయాలకు వస్తోన్నారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+